దసరా బరిలో మూడు భారీ సినిమాలు ఉన్నాయి.మరి వాటిలో కోలీవుడ్ నుండి రాబోతున్న ‘లియో’ సినిమా( Leo Movie ) ఒకటి.
దళపతి విజయ్ జోసెఫ్ (Thalapathy Vijay) సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘లియో’ (LEO).ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇప్పటి వరకు మేకర్స్ పెద్దగా ప్రమోషన్స్ అయితే చేసింది లేదు.
తమిళ్ లో కూడా ఎలాంటి ఈవెంట్స్ ను ప్లాన్ చేయలేదు.
కేవలం సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేసారు.అయినప్పటికీ ఈ సినిమాకు గతంలో విజయ్ సినిమాలకు సైతం లేనంత హైప్ పెరిగింది.
ఇక విజయ్ సైతం మిగిలిన హీరోల్లా పెద్దగా ప్రమోషన్స్ లో పాల్గొనరు.ఇక తెలుగులో కూడా ఈయన అన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి కానీ ప్రమోషన్స్ కోసం ఎప్పుడు రారు.
విజయ్ తెలుగులో మార్కెట్ కోసం ఎన్నో ఏళ్ల నుండి ట్రై చేస్తుండగా ఇప్పుడు లియో సినిమాతో అది నెరవేరినట్టు అనిపిస్తుంది.ఈ సినిమాకు కనీసం ఎలాంటి ప్రెస్ మీట్స్ కానీ ప్రమోషన్స్ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్( Pre Release Event ) వంటివి ఏవీ లేకపోయినా ఊహించని లెవల్లో భారీ బుకింగ్స్( Leo Bookings ) ఇక్కడ కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది.ఒకవైపు మన సినిమాలు రెండు ఉన్న వాటిని వదిలేసి మరీ విజయ్ లియో సినిమాకు భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం విశేషం.
మరి రిలీజ్ తర్వాత ఈ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.కాగా ‘లియో’ సినిమాలో విజయ్ కు జంటగా స్టార్ హీరోయిన్ త్రిష( Trisha ) నటిస్తుంది.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నారు.