మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ అవైటెడ్ మూవీ ‘రావణాసుర’.ఈ సినిమా కూడా అప్పుడే రిలీజ్ కు రెడీ అయ్యింది.
గత కొన్ని రోజుల క్రితమే వెంటవెంటనే రెండు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న రవితేజ ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం పరితపిస్తున్నాడు.ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో వచ్చిన సక్సెస్ ను కంటిన్యూ చేయడానికి రెడీ అయ్యాడు.
ఈ క్రమంలోనే రావణాసుర సినిమా కోసం మాస్ రాజా ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టు కున్నాయి.
ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ అయ్యి ఆకట్టుకుని మంచి అంచనాలు ఏర్పరిచాయి.ఇటీవలే షూట్ సైతం పూర్తి చేసుకుని ఇక వరుస ప్రమోషన్స్ కు టీమ్ అంతా రెడీ అయ్యింది.

ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుండి టీజర్ వస్తున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా అప్డేట్ ఇచ్చారు.ఈ సినిమా నుండి టీజర్ మార్చి 6న ఉదయం 10 గంటల 8 నిముషాలకు రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ ద్వారా ప్రకటించారు.ఈ పోస్టర్ సైతం ఫ్యాన్స్ కు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.మొదటి నుండి స్టోరీ గురించి ఎలాంటి ఇంఫర్మేషన్ రిలీజ్ చేయని మేకర్స్ ఈ టీజర్ తో అయినా స్టోరీ కొద్దిగా రివీల్ చేస్తారో లేదో వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉండగా రావణాసుర సినిమాను అభిషేక్ పిక్చర్స్, ఆర్టి టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో మాస్ రాజాకు జోడీగా అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నాగర్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్ లు నటిస్తుండగా.హర్ష వర్ధన్, భీమ్స్ సిసిరోలియా సంగీతం అందిస్తున్నారు.అక్కినేని హీరో సుశాంత్ ఈ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తుండగా.ఏప్రిల్ 7న పాన్ ఇండియా వ్యాప్తంగా రావణాసుర సినిమా రిలీజ్ కాబోతుంది.







