టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈమధ్య కీర్తి సురేష్ హాట్ హాట్ గా కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యపడేలా చేస్తుంది.
ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలో తన నటనతో, అందంతో ఎంతో మంది అభిమానుల హృదయాలను దోచుకుంది.కీర్తి సురేష్ మొదట మోడలింగ్ రంగం నుండి మంచి గుర్తింపు పొంది ఆ తర్వాతే సినిమా పరిశ్రమకు పరిచయమైంది.
ఇక ఆమె సినిమాలలో ఎంచుకునే పాత్రలు కూడా ఎంతో ఆకట్టుకుంటాయి.తొలిసారిగా పైలెట్స్ అనే మలయాళం సినిమా ద్వారా బాలనటిగా వెండితెరపై అడుగు పెట్టగా.
తరువాత తమిళ సినిమాలలో నటించింది.

ఇక 2016లో నేను శైలజ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాలో తన పాత్రతో మాత్రం అందరిని ఫిదా చేసింది.ఇక ఆ తర్వాత నటించిన మహానటి సావిత్రి పాత్ర ఎంత ఆకట్టుకుందో చెప్పనవసరమే లేదు.
ఎందుకంటే ఆ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో లీనమైపోయింది.ఇక ఈ సినిమా తర్వాత ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వచ్చిపడ్డాయి.

పైగా మంచి అభిమానాన్ని కూడా సంపాదించుకుంది.మహానటి సినిమా తర్వాత కూడా పలు సినిమాలలో అవకాశాలు అందుకొని మంచి సక్సెస్ లు సొంతం చేసుకుంది.ఇక సర్కారు వారి పాటలో కూడా మంచి సక్సెస్ అందుకుంది కీర్తి.ఈ సినిమాల్లో ఏకంగా గ్లామర్ షో కూడా చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.ఇక అప్పటినుంచి బాగా గ్లామర్ షో చేసుకుంటూ పోతుంది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉండటంతో అక్కడ కూడా మంచి అభిమానం ఏర్పరచుకుంది.
అందులో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.ఒకప్పుడుకీర్తి సురేష్ లుక్ ఎంతో హోమ్లీగా ఉండేది.
అంతేకాకుండా ఎక్కువ ట్రెడిషనల్ లుక్ లోనే కనిపిస్తుండేది.కానీ ఈ మధ్య గ్లామర్ ను పరిచయం చేసింది కీర్తి.

కెరీర్ మొదట్లో చాలా బొద్దుగా కూడా ఉండేది.ఇక అవకాశాల కోసం బాగా వర్కౌట్లు చేసి చాలా సన్నబడింది.నిజానికి బొద్దుగా ఉన్నప్పుడే కీర్తి సురేష్ చాలా అందంగా ఉండేది.ఇక ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఆమె నాని సరసన దసరా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ బిజీలో ఉండగా.ఆ సినిమా సెట్ సమయంలో దిగిన ఫోటోలను బాగా పంచుకుంటూ ఉంది.
ఒకవైపు నాని కూడా ఆ సినిమా షూటింగ్ సెట్ లో దిగిన ఫోటోలను బాగా పంచుకుంటూ ఉన్నాడు.అయితే తాజాగా ఆమె దసరా సినిమాకు సంబంధించిన గెటప్ ను పంచుకుంది.
ఇక అందులో ఆమె చాలా డిఫరెంట్ గా కనిపించింది.అచ్చం ఊరు అమ్మాయి లాగా కనిపించింది.
ఇప్పటివరకు కీర్తి సురేష్ ని ఆ లుక్ లో చూడలేదని చెప్పాలి.ఇక ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవ్వగా తన ఫ్యాన్స్ ఆ ఫోటోని చూసి మురిసిపోతున్నారు.







