Ravi Teja : తమిళ్ రీమేక్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న రవితేజ.. తెలుగు సినిమాలు చెయ్యడం కష్టమే?

పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ పెరిగిన తర్వాత టాలీవుడ్ హీరోలకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.దానికి తోడు బాలీవుడ్ హీరోల సినిమాలు ఫ్లాప్ అవుతుండడంతో టాలీవుడ్ హీరోల పేర్లు బాలీవుడ్ లో టాలీవుడ్ లో మారుమోగిపోతున్నాయి.

 Mass Maharaja Ravi Teja Bollywood Entry-TeluguStop.com

ఇటీవల కాలంలో టాలీవుడ్ నుంచి వచ్చిన పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ ను ఏలుతున్నాయి.దాంతో బాలీవుడ్ లో కూడా టాలీవుడ్ హీరోలకు క్రేజ్ పెరిగిపోవడంతో బాలీవుడ్ దర్శక నిర్మాతలు టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తిని కనపడుతున్నారు.

ఇప్పటికి టాలీవుడ్ లో రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి హీరోలు ఇప్పటికే హిందీలో సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.హీరోలుగా కాకపోయినా కనీసం బాలీవుడ్ సినిమాలలో గెస్ట్ రోల్ లో నటించమని కోరుతున్నారు బాలీవుడ్ నిర్మాతలు.

ఇక ఇప్పటికే బ్రహ్మాస్త్ర సినిమాలో నాగార్జున నటించిన విషయం తెలిసిందే.అలాగే అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాలో నాగచైతన్య నటించారు.

సల్మాన్ ఖాన్( Salman Khan ) హీరోగా నటిస్తున్న కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

Telugu Bollywood, Maanaadu, Mass Maha Raja, Raviteja, Salman Khan, Silambarasan

ఇందులో మెగా పవర్ స్టార్ చరణ్‌ కూడా గెస్ట్‌ రోల్‌లో ఓ సాంగ్ లో స్టెప్పులేయబోతున్నాడు.ఇప్పటికీ సల్మాన్ ఖాన్, వెంకటేష్,రామ్ చరణ్ ముగ్గురు కలిసి చేసిన ఒక మాస్ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా మరో టాలీవుడ్ హీరో బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఆ హీరో మరెవరో కాదు క్రాక్, ధమాకా, వాల్తేరు వీరయ్య, రావణాసుర ఇలా బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో హిట్లు కొడుతూ.తిరిగి ఫామ్‌లోకి వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ( Ravi teja )హీరో రవితేజతో హిందీ మేకర్స్ ఒక రీమేక్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

అందులో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్( Varun Dhawan ) నటించబోతున్నట్టు తెలుస్తోంది.అది కూడా సౌత్ రీమేక్ సినిమాలో ఈ ఇద్దరు హీరోలు కనిపించబోతున్నారట.

Telugu Bollywood, Maanaadu, Mass Maha Raja, Raviteja, Salman Khan, Silambarasan

తమిళంలో కలెక్షన్ ల సునామిని సృష్టించిన మానాడు సినిమాను( Maanaadu ) బాలీవుడ్‌లో రీమేక్‌ చేయబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.కాగా తమిళంలో శింబు నటించిన పాత్రలో వరుణ్‌ చేయగా, ఎస్‌.జే సూర్య చేసిన పాత్రలో రవితేజ చేయనున్నట్లు సమాచారం.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన విషయాలు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ కన్ఫామ్ అయినట్టుగానే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాను రానా, ఏషియన్‌ సునీల్‌తో కలిసి కరణ్‌ జోహర్‌ నిర్మిస్తున్నాడట.

ఒకవేళ ఇదే వార్త కనుక నిజమైతే మరో టాలీవుడ్ హీరో బాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్ అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube