తమిళ దర్శకుడితో మాస్ మహారాజ్..!

మాస్ మహరాజ్ రవితేజ ఖిలాడి నిరాశపరచడంతో మళ్లీ తన సినిమాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టాడు.

ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర సినిమాలు చేస్తున్న రవితేజ తన నెక్స్ట్ సినిమా ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

ఈసారి రవితేజ తమిళ డైరక్టర్ తో సినిమా చేయాలని చూస్తున్నారట.కోలీవుడ్ లో సిద్ధార్థ్ తో లవ్ ఫెయిల్యూర్ సినిమా చేసిన బాలాజి మోహన్ ధనుష్ తో మారి, మారి 2 సినిమాలు తీసి హిట్ అందుకున్నాడు.

అతని డైరక్షన్ లో రవితేజ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా వస్తుందని అంటున్నారు.ఆ సినిమాని ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుందని తెలుస్తుంది.

రవితేజ సినిమాల లైనప్ అదిరిపోయింది.క్లాస్ మాస్ అనే తేడాలు లేకుండా డిఫరెంట్ స్టోరీస్ తో తన ఫ్యాన్స్ కు సూపర్ ట్రీట్ అందించాలని చూస్తున్నారు మాస్ మహరాజ్.

Advertisement

క్రాక్ తో తర్వాత ఖిలాడి మళ్లీ ఫ్లాప్ పడినా ఈసారి మరింత ఫోకస్ తో సినిమాలు చేస్తున్నారు.బాలాజి మోహన్ సినిమా గురించి మిగతా డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది.

ఆ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే రవితేజ చేసే మొదటి బైలింగ్వల్ మూవీ అదే అవుతుంది.

Advertisement

తాజా వార్తలు