ఆటో అమ్మి కూతురికి వయోలిన్.. అరుదైన ఘనత సాధించిన కూతురు.. ఈమె సక్సెస్ కు గ్రేట్ అనాల్సిందే!

తల్లీదండ్రులు పిల్లల కోసం ఎంతైనా కష్టపడటానికి సిద్ధంగా ఉంటారు.పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఆలోచనతో అప్పులు చేసి మరీ పిల్లలను చదివించే వాళ్లు చాలామంది ఉన్నారు.

ప్రస్తుతం దేశం మొత్తం కేరళకు చెందిన ఒక చిన్నారి టాలెంట్ ను తెగ ప్రశంసిస్తుండటం గమనార్హం.14 సంవత్సరాల వయస్సులోనే మార్టినా( Martina ) అనే చిన్నారి ట్రినిటీ కాలేజ్ ఇండియా( Trinity College ) ఫెలోషిప్ కు ఎంపికై రికార్డ్ సృష్టించారు.మన దేశంలో గతంలో కూడా ఈ రికార్డ్ సాధించిన వాళ్లు ఉన్నప్పటికీ ఇంత చిన్న వయస్సులో ఈ రికార్డ్ సాధించడం గమనార్హం.

కేరళ( Kerala ) నుంచి ఈ రికార్డ్ సాధించిన తొలి చిన్నారి మార్టినా కాగా వయోలిన్ లో( Violin ) గొప్ప పేరు సంపాదించిన ఈ చిన్నారి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.అయితే ఈ చిన్నారి సక్సెస్ వెనుక తండ్రి కష్టం ఎంతో ఉంది.

కన్నూరు జిల్లాలోని పెరవూర్ మార్టినా స్వస్థలం.

మార్టినా తండ్రి బాల్యంలో గొప్ప మ్యూజీషియన్( Musician ) కావాలని కలలు కన్నా ఆ కలలను నిజం చేసుకోలేకపోయారు.ఆటో నడుపుతూ( Auto Driver ) మార్టినా తండ్రి కుటుంబాన్ని పోషించేవారు.ఆరేళ్ల వయస్సు నుంచే మార్టినాకు మ్యూజిక్ పై ఆసక్తి ఉండేది.

Advertisement

మార్టిన్ కోసం వయోలిన్ అవసరం కాగా ఆమె తండ్రి ఆటో అమ్మి మరీ లక్ష రూపాయలు ఖర్చు చేసి వయోలిన్ ను కొని ఇచ్చారు.గొప్పగొప్ప గురువుల దగ్గర మార్టినా శిక్షణ పొందారు.

వయోలిన్ నేర్చుకునే సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా మార్టినా మాత్రం ఒక్కో మెట్టు పైకి ఎదిగారు.ఆల్ ఇండియా వయోలిన్ కాంటెస్ట్ 2022, 2023 సంవత్సరాలలో మార్టినా విజేతగా నిలిచారు.మార్టినా రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

మార్టినా సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు