వివాహిత అనుమాస్పద మృతి.. హత్యే అని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు..!

ఇటీవలే కాలంలో కుటుంబాలలో తలెత్తుతున్న కలహాలు హత్యలకు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి.

ఎన్నో ఆశలతో అత్తింట్లో వివాహ బంధంతో అడుగుపెట్టి, అత్తింటి వేధింపులు భరించలేక అటు తల్లిదండ్రులకు విషయాలు చెప్పలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

మరికొందరైతే భర్త, అత్తమామల చేతులలోనే దారుణంగా హత్యకు గురై ప్రాణాలను విడుస్తున్నారు.ఇలాంటి కోవకు చెందిన ఒక ఘటన హైదరాబాద్ లోని( Hyderabad ) అత్తాపూర్ లో చోటుచేసుకుంది.

అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.హైదరాబాదులోని సన్ సిటీ కి చెందిన హారతిని( Harathi ) నంది ముసిగుడా కు చెందిన సంతోష్ రెడ్డి తో( Santosh Reddy ) మూడేళ్ల క్రితం వివాహం జరిగింది.గత కొంతకాలంగా భర్త సంతోష్ రెడ్డి తో పాటు అత్తమామలతో హారతికి గొడవలు జరగడం మొదలయ్యాయి.

Advertisement

అయితే హారతి అన్ని విషయాలను తమ తల్లిదండ్రులకు చెప్పింది.దీంతో హారతి కుటుంబ సభ్యులు అల్లుడు ఫ్యామిలీతో మాట్లాడి గొడవ సర్దుమనిగేలాగా చేశారు.

కానీ సంతోష్ రెడ్డి ప్రవర్తనలో మార్పు అనేది రాలేదు.తరచూ భర్తతోపాటు అత్తమామలు హారతిని చిత్రహింసలు పెట్టేవారు.

తాజాగా గురువారం రాత్రి సంతోష్ రెడ్డి కుటుంబ సభ్యులు సన్ సిటీ లో( Suncity ) నివసిస్తున్న హారతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి హారతి ఆరోగ్యం బాగాలేదని చెప్పారు.ఆ విషయం విన్న వెంటనే హారతి కుటుంబ సభ్యులు ముసిగూడ కు వచ్చారు.అక్కడ మంచం పై హరతి మిగతాజీవిగా పడి ఉంది.

కన్న కూతురు మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.తన కూతురిని సంతోష్ రెడ్డి తో పాటు అతని తల్లిదండ్రులు హత్య చేశారని ఆరోపిస్తున్నారు.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
పక్క రాష్ట్రంపై బాబు చూపు ?  వర్కవుట్ అయ్యేనా ? 

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

Advertisement

తాజా వార్తలు