బెడ్ రూమ్ విషయాల్లో అత్త కలగజేసుకుంటుందని అల్లుడు ఏకంగా...

ఈ మధ్య కాలంలో కొందరు తమకు సంబంధం లేనటువంటి విషయాలలో తలదూర్చి అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

కాగా తాజాగా ఓ మహిళ తన కూతురు బెడ్ రూమ్ విషయాలలో తలదూర్చి అల్లుడు చేతిలో దారుణంగా హత్యకు గురైన ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోనే చెన్నై పరిసర ప్రాంతంలో మాలిని అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది.కాగా మాలిని కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా ఉన్నటువంటి ఓ ఆసుపత్రిలో నర్స్ గా ఉద్యోగం చేస్తోంది.

ఇటీవలే మాలిని కూతురుని మంచి ఉద్యోగంలో సెటిల్ అయిన ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసింది.అయితే పెళ్లయిన కొత్తలోఅల్లుడు, కూతురు చాలా అన్యోన్యంగా ఉండే వాళ్ళు.

కానీ ఈ మధ్య కాలంలో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.దీంతో మాలిని తన కూతురికి వంతు పాడుతూ అల్లుడుపై నిందలు వేయడం మరియు తప్పుడు ప్రచారాలు చేయడం వంటివి చేస్తోంది.

Advertisement

దీంతో మాలిని అల్లుడు ఆమెపై కోపం పెంచుకున్నాడు.

తాజాగా మాలిని కూతురు అల్లుడు గొడవ పడుతుండగా మాలిని కలగజేసుకుంది.ఈ క్రమంలో తన అల్లుడిని కొట్టబోయింది.దీంతో ఆవేశం కట్టలు తెచ్చుకున్న మాలిని అల్లుడు ఆమెపై చేతికందిన కత్తితో దారుణంగా దాడి చేశాడు.

దీంతో గాయాలు బలంగా తగలడంతో మాలిని అక్కడికక్కడే మృతి చెందింది.దాంతో మాలిని అల్లుడు భయంతో అక్కడి నుంచి తన భార్యను తీసుకొని పరారయ్యాడు.స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మాలిని మృతదేహాన్ని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు.

అనంతరం విచారణలో భాగంగా పోలీసుల గాలించి మాలిని అల్లుడని అదుపులోకి తీసుకుని విచారించగా క్షణికావేశంలో తన అత్తపై దాడి చేసినట్లు మాలిని అల్లుడు నేరం అంగీకరించాడు.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు