షిప్పింగ్ కంటైనర్‌లో మ్యారేజ్‌హాల్.. ప్రశంసించిన ఆనంద్ మహీంద్రా

చదువుతో సంబంధం లేకుండా కొంత మంది చేసే ఆవిష్కరణలు పలువురిని ఆకట్టుకుంటాయి.ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతాయి.

 Marriagehall In A Shipping Container Praised By Anand Mahindra , Shippin, Contr-TeluguStop.com

వాటిని చూసినప్పుడు ఎవరైనా ప్రశంసించకుండా ఉండలేరు.తాజాగా అలాంటి వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది.

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.షిప్పింగ్ కంటైనర్‌లో మ్యారేజ్ హాల్ భలే ఉందని ఆయన ప్రశంసించారు.

ఈ ఆవిష్కరణ వెనుక ఉన్నవారి సృజనాత్మకతను మహీంద్రా ప్రశంసించారు.వాహనాలను రవాణా చేయడానికి తరచుగా ఉపయోగించే ఒక పెద్ద ట్రక్కు హాల్ లాంటిది ఆ వీడియోలో కనిపిస్తుంది.

ట్రక్ పరిమాణం 40×30 చదరపు అడుగుల పోర్టబుల్ హాల్‌గా మారుతుంది.కళ్యాణ మండపంలో స్టైలిష్ ఫర్నీచర్ సహా 200 మంది కూర్చునే అవకాశం ఉందని వీడియో చూడడం ద్వారా తెలుస్తోంది.

ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో వీడియోను షేర్ చేసి, దానిపై ప్రశంసల వర్షం కురిపించారు.“చాలా సృజనాత్మకంగా, ఆలోచనాత్మకంగా ఉంది” అని క్యాప్షన్ ఇచ్చారు.దీనిని పర్యావరణ అనుకూలమైనదిగా పేర్కొన్నారు.“నేను ఈ ఆవిష్కరణ యొక్క భావన, రూపకల్పన వెనుక ఉన్న వ్యక్తిని కలవాలనుకుంటున్నాను.చాలా సృజనాత్మకంగా మరియు ఆలోచనాత్మకంగా ఉంది.మారుమూల ప్రాంతాలకు సదుపాయాన్ని అందించడమే కాకుండా పర్యావరణ అనుకూలతను కలిగి ఉంది.జనాభా-సాంద్రత కలిగిన దేశంలో స్థలాల కొరత సమస్యకు ఇది పరిష్కారం చూపుతుంది” అని రాశారు.నెటిజన్లు కూడా ఈ ప్రత్యేకమైన కాన్సెప్ట్‌ను ప్రశంసించారు.

ట్విట్టర్‌లో ఇలాంటి వినూత్న ఆవిష్కరణలు చేస్తున్న వారిని వెలుగులోకి తీసుకొస్తున్నందుకు ఆయనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఆనంద్ మహీంద్రాకు పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలిపారు.

ఇప్పటికే దేశంలో నగరాలు, పట్టణాలలో ఫంక్షన్ హాల్ దొరకక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు.ఒక వేళ ఫంక్షన్ హాల్ దొరికినా, వాటికి ఇబ్బడి ముబ్బడిగా ధరలను చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు.

అటువంటి తరుణంలో ఇలాంటివి ఎంతో పరిష్కారం అందిస్తాయి.ప్రస్తుతం ఈ షిప్పింగ్ కంటైనర్‌లో మ్యారేజ్ హాల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube