డాలర్‌ వాడకాన్ని తగ్గిస్తున్న పలు దేశాలు, రూపాయినే కరెన్సీగా ఎంచుకుంటున్న వైనం!

ఇరుగుపొరుగువారికి ఆర్ధిక సంబంధాలు వున్నట్టే… ఒక దేశానికి, మరో దేశానికి కూడా వాణిజ్య సంబంధాలు అనేవి ఉంటాయి.ఈ క్రమంలోనే దిగుమతులు, ఎగుమతులు అనేవి జరుగుతూ ఉంటాయి.

 Many Countries Are Reducing The Use Of The Dollar And Are Choosing The Rupee As-TeluguStop.com

ఈ క్రమంలోనే చాలా దేశాలు తమ వ్యాపార చెల్లింపుల విషయంలో డాలర్‌ను ఎక్కువగా వినియోగిస్తాయి.ఇక డాలర్ విలువ విషయంలో హెచ్చుతగ్గులు జరిగినపుడు ఆ ప్రభావం ఎగుమతి, దిగుమతులమీద పడి విదేశీ మారక నిల్వలు అనేవి తగ్గుముఖం పడతాయి.

దీంతో ఇప్పుడు చాలా దేశాలు ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా సొంత కరెన్సీలో పేమెంట్స్ చేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నాయి.

Telugu Bangladesh, Dollar, India, Indian Currency, International, Latest, Singap

అయితే ఈ విషయంలో మిగతా దేశాలకంటే భారత్( India ) కాస్త ముందుంది.ఈ క్రమంలో ఇండియా చాలా దేశాలకు రూపాయిల్లో పేమెంట్స్ చేస్తోంది.తాజాగా బంగ్లాదేశ్‌తో( Bangladesh ) కూడా భారత్ సొంత కరెన్సీలోనే ట్రాన్సాక్షన్స్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.అవును… ఇండియా, బంగ్లాదేశ్‌ ట్రేడ్‌ సెటిల్‌ చేసుకోవడానికి యూఎస్‌ డాలర్‌ను ఇకనుండి వినియోగించకూడదని ఓ నిర్ణయానికి రావడం కొసమెరుపు.

ఇకనుంచి భారత్‌ రూపాయిని, బంగ్లాదేశ్ టాకాని చెల్లింపులకు వినియోగించనున్నాయి.

ఈ ద్వైపాక్షిక వాణిజ్యం ద్వారా రెండు దేశాల బ్యాంకుల టాకా, రూపాయలలో డైరెక్ట్‌ ట్రాన్సాక్షన్‌లు చేయవచ్చు.

Telugu Bangladesh, Dollar, India, Indian Currency, International, Latest, Singap

దీనివలన ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ రిజర్వ్స్‌పై ఒత్తిడి తగ్గి, ఇరు దేశాల మధ్య వాణిజ్యం వృద్ధి చెందుతుందని అనుకుంటున్నారు.ఇకపోతే చాలా దేశాలు అమెరికాకు ఝలక్ ఇవ్వడానికి సిద్ధమౌతున్నాయి.

Telugu Bangladesh, Dollar, India, Indian Currency, International, Latest, Singap

భౌగోళిక, రాజకీయ పరిస్థితుల ప్రభావం నుంచి తప్పుకోవడానికి చాలా దేశాలు డాలర్‌తో ట్రేడ్‌ చేయడం తగ్గించాలనే ఆలోచనలో ఉన్నాయి.బంగ్లాదేశ్ కంటే ముందే… యునైటెడ్ కింగ్‌డమ్‌, సింగపూర్, రష్యా( Singapore ) , శ్రీలంక, బోట్స్వానా, జర్మనీ, ఫిజీ, గయానా, ఇజ్రాయెల్, మలేషియా, కెన్యా, మారిషస్, న్యూజిలాండ్, మయన్మార్, ఒమన్, సీషెల్స్, టాంజానియా, ఉగాండా వంటి 18 దేశాలు ఇప్పటికే భారతదేశంతో రూపాయలలో వాణిజ్యాన్ని ప్రారంభించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube