ఇటీవలి సంవత్సరాలలో రెస్క్యూ ఆపరేషన్ల వీడియోలు( Rescue Operations ) చాలా సాధారణం అయ్యాయి.ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి ఇతరులను రక్షించడానికి కొందరు ప్రాణాలను పణంగా పెట్టి హీరోలుగా ప్రశంసలు అందుకున్నారు.
బిజీ రోడ్డును క్రాస్ చేస్తున్నప్పుడు చిన్న పిల్లలను వాహనాలు ఢీకొట్టకుండా కాపాడటం, ఎత్తయిన భవనం( Tall Building ) అంచుల పైకి వచ్చిన పిల్లలను రక్షించడం వంటి సంఘటనలు ఇటీవల కాలంలో చాలానే వెలుగులోకి వచ్చాయి.

అలాంటి మరో సంఘటన ఇటీవల కజకిస్తాన్‌లో( Kazakhstan ) జరిగింది.ఈ ఘటనలో ఎనిమిదో అంతస్తు కిటికీకి( Window ) వేలాడుతున్న మూడేళ్ల బాలికను రక్షించడానికి ఒక వ్యక్తి భవనం ఎక్కాడు.తర్వాత ఆ బాలిక కాళ్ళ కింద స్టూల్స్ పెట్టాడు.
ఆపై బాలికను చాలా జాగ్రత్తగా కిందికి దింపాడు.ఆ వ్యక్తి వీరోచిత ప్రయత్నాలను సోషల్ మీడియా యూజర్లు ప్రశంసించారు.
అతని ధైర్యసాహసాలకు అతన్ని హీరోగా కొనియాడారు.@TansuYegen ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 47 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.

అదేవిధంగా, చైనాలో ఐదవ అంతస్తులోని కిటికీ నుంచి పడిపోతున్న రెండేళ్ల బాలికను ఒక వ్యక్తి పట్టుకున్నాడు.ఇలాంటి సంఘటనలు చైనాలో అసాధారణం కాదు, 2020లో, చాలా మంది పొరుగువారు ఒక ఎత్తైన భవనం నుంచి దుప్పటిని ఉపయోగించి పడిపోతున్న పిల్లవాడిని పట్టుకున్నారు.ఈ వీడియోలు ఇతరులను రక్షించడానికి తమ సొంత భద్రతను పణంగా పెట్టే వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారని చెప్పకనే చెబుతున్నాయి.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.







