నా భార్య ముస్లిం నేను హిందువు.. మతం పేరుతో మేము ఘర్షణ పడమంటూ?

ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాలకు ఊహించని స్థాయిలో మార్కెట్ పెరుగుతుండగా పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు ఊహించని స్థాయిలో రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి.

ప్రముఖ నటుడు మనోజ్ బాజ్ పేయి( Manoj Bajpayee ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఫ్యామిలీ మేన్( Family Man ) వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా ఈ నటుడి పేరు ఊహించని స్థాయిలో మారుమ్రోగింది.ఒకవైపు సినిమాలలో మరోవైపు వెబ్ సిరీస్ లలో మనోజ్ బాజ్ పేయి విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

మనోజ్ బాజ్ పేయి హిందువు కాగా కొన్నిరోజుల క్రితం ఈ వ్యక్తి ఒక ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నారు.మనోజ్ ముస్లిం అమ్మాయిని( Muslim ) పెళ్లి చేసుకోవడం గురించి కొంతమంది భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

మతాలు వేరు కావడం వల్ల భార్యాభర్తలకు గొడవలు జరుగుతున్నాయా అనే ప్రశ్నకు మనోజ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.షబానాతో ( Shabana ) నా మ్యారేజ్ మతం కంటే విలువలకు సంబంధించినది అని భవిష్యత్తులో ఎవరైనా విలువలను మార్చుకుంటే వాళ్ల వివాహ బంధం ఎక్కువ కాలం నిలబడదని ఆయన చెప్పుకొచ్చారు.అయితే మా వివాహానికి ఏదీ అడ్డు రాలేదని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

Advertisement

నా భార్యకు ప్రత్యేకించి మతం లేదని కానీ ఆమె స్పిరిచ్యువల్ అని మనోజ్ బాజ్ పేయి అన్నారు.నేను హిందువుగా గర్విస్తానని ఆమె ముస్లింగా గర్విస్తుందని మనోజ్ బాజ్ పేయి చెప్పుకొచ్చారు.అంతే తప్ప ఒకరితో ఒకరు ఘర్షణ పడము అని మనోజ్ బాజ్ పేయి కామెంట్లు చేశారు.

మనోజ్ బాజ్ పేయి చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఈ కామెంట్లను నెటిజన్లు తెగ ప్రశంసిస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు