జాతి వివక్ష, హక్కులపై పోరాడుతోన్న భారత సంతతికి చెందిన మహిళకు అమెరికాలో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది.‘‘బ్యాంక్ ఆఫ్ అమెరికా నైబర్‌హుడ్ బిల్డర్స్: రేషియల్ ఈక్వాలిటీ అవార్డు’’ పొందిన ఐదుగురిలో ఈ భారతీయ-అమెరికన్ మహిళ కూడా ఉన్నారు.ఈ మేరకు మార్చి 24 ప్రకటన వెలువడింది.లాస్ ఏంజెల్స్ నగరంలో స్థిరపడిన మంజూషా పి.కులకర్ణి.AAPI ఈక్విటీ అలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
జాతి సమానత్వం, ఆర్ధిక అవకాశాలను పెంపొందించే ప్రయత్నంలో భాగంగానే ఈ అవార్డులను బహూకరిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.జాతి అడ్డంకులను విచ్ఛిన్నం చేయడం, నల్లజాతీయులు, హిస్పానిక్- లాటిన్, ఆసియా- అమెరికన్లకు ఆర్ధిక అశకాశాలను సృష్టించేందుకు చేసిన సేవలకు గాను ఈ ఐదుగురిని అవార్డుకు ఎంపిక చేసినట్లు చెప్పారు.
ఇకపోతే.మంజూషా కులకర్ణీ లాస్ ఏంజిల్స్ కేంద్రంగా పనిచేస్తోన్న ఏఏపీఐ ఈక్విటీ అలయెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.అంతేకాదు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ ఆసియన్ అమెరికన్ స్టడీస్ డిపార్ట్‌మెంట్‌లో లెక్చరర్‌గా కూడా ఆమె పనిచేస్తున్నారు.కోవిడ్ 19 మహమ్మారి సమయంలో ఆమె ‘‘Stop AAPI Hate’’ని స్థాపించారు.
ఇది అమెరికాలో ఏఏపీఐలకు వ్యతిరేకంగా జరిగిన కరోనా ద్వేషపూరిత సంఘటనపై పోరాడుతోంది.ఈ సంస్థ క్రియశీలక కార్యకలాపాల కారణంగా మంజూష, సహా వ్యవస్థాపకులను అత్యంత ప్రభావశీల వ్యక్తులుగా టైమ్ మ్యాగజైన్ 2021 గుర్తించింది.

2014లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేతుల మీదుగా వైట్‌హౌస్ ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డును అందుకున్నారు మంజూష కులకర్ణీ.ఆసియా విద్వేష దాడులకు వ్యతిరేకంగా గతేడాది మార్చిలో హౌస్ జ్యూడిషియరీ కమిటీ ముందు సాక్ష్యమిచ్చారు.మరోవైపు ఆమెకు ‘‘బ్యాంక్ ఆఫ్ అమెరికా నైబర్‌హుడ్ బిల్డర్స్: రేషియల్ ఈక్వాలిటీ అవార్డు’’ దక్కడం పట్ల సౌత్ ఏషియన్ నెట్‌వర్క్ హర్షం వ్యక్తం చేసింది.ఈ మేరకు ఒక ప్రకటనలో అభినందనలు తెలిపింది.
ఇక ఈ అవార్డు పొందిన మిగిలిన నలుగురి విషయానికి వస్తే.న్యూయార్క్‌కు చెందిన ఎడ్గార్ విల్లాన్యువా, మేరీల్యాండ్‌కు చెందిన జాన్ రైస్, ఫ్లోరిడాకు చెందిన లూజ్ కార్క్యూరా , జార్జియాకు చెందిన నథానియల్ స్మిత్.







