Manjima Mohan Gautam Karthik: పదిరోజుల్లో పెళ్లి పెట్టుకొని కాబోయే భర్త ఫోటోలన్నీ డిలీట్ చేసిన నటి.. అసలేం జరిగిందంటే?

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేర్లు నటి మంజీమా మోహన్ హీరో గౌతమ్ కార్తీక్.

గత కొంతకాలంగా ఈ జంట రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో ఆ వార్తలపై స్పందించిన ఈ జంట ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదు అంటూ కొట్టి పడేసింది.అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు నిజం అంటూ ఇటీవలే వారి ప్రేమ వ్యవహారాన్ని అధికారికంగా ప్రకటించేశారు ఈ జంట.వీరిద్దరికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.ఈ ప్రేమ జంట మరికొద్దీ రోజుల్లోనే వైవాహిక బంధం లోకి అడుగు పెట్టబోతున్న విషయం తెలిసిందే.

అయితే ఈ జంట అభిమానులు వీరి పెళ్లి అప్డేట్ ల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలను ఇంస్టాగ్రామ్ లో పంచుకుంటుంది అని అందరూ అభిమానులు భావించారు.

ఇటువంటి సమయంలో మంజీమా మోహన్ తాజాగా అభిమానులకు ఒక్కసారిగా ఊహించని షాక్ ఇచ్చింది.తాజాగా మంజిమా మోహన్ తన ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు మొత్తం డిలీట్ చేసి ఒక్కసారిగా అభిమానులకు షాక్ ఇచ్చింది.

Advertisement

కాగా మంజీమా మోహన్, గౌతమ్ కార్తీక్ ల పెళ్లి నవంబర్ 28న చెన్నైలోనే ఒక ప్రముఖ ఫంక్షన్ హాల్లో జరగనున్న విషయం తెలిసిదే.కొద్దీ రోజుల క్రితమే కార్తీక్ తో ప్రేమలో పడిన విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంజిమా మోహన్ తన పెంపుడు పిల్లి ఫోటో మినహా మిగిలిన ఫోటో మిగిలిన పోస్టులన్నీ కూడా ఇంస్టాగ్రామ్ నుంచి తొలగించింది.ఈ విషయంపై పలువురో ఆమెను ట్రోలింగ్స్ చేస్తూ కామెంట్స్ చేయడంతో ఆ విషయంపై స్పందించిన ఆమె ఎదుటివారితో సత్సంబంధాలు పెంచుకోవడానికి ఇంస్టాగ్రామ్ ఒక మంచి ప్రదేశం.

ఇప్పటివరకు నేను షేర్ చేసిన పోస్టులన్నింటినీ ఆర్కైవ్ చేసావా ఇప్పుడు నా ప్రయాణం మళ్లీ మొదలైంది అని తెలిపింది మంజీమా మోహన్.

Advertisement

తాజా వార్తలు