ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన మనీశ్ సిసోడియకు న్యాయస్థానం రిమాండ్ విధించింది.ఈ మేరకు సిసోడియాకు 14రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించడంతో అధికారులు ఆయనను తీహార్ జైలుకు తరలించారు.
అయితే మద్యం కుంభకోణంలో సిసోడియాను అరెస్ట్ చేసిన అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇవాళ్టితో సీబీఐ కస్టడీ ముగియడంతో స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు.
కేసు పురోగతిని న్యాయస్థానానికి వివరించిన సీబీఐ అధికారులు లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అవకతవకలపై ఇంకా ప్రశ్నించాల్సి ఉన్న కారణంగా మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు.దీంతో సిసోడియాకు కోర్టు రిమాండ్ విధించింది.







