ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీశ్ సిసోడియా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా బీజేపీపై ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ క్రమంలో ప్రధాని మోదీని ఉద్దేశించి సిసోడియా ఘాటు వ్యాఖ్యలు చేశారు.సార్, మీరు నన్ను జైలులో పెట్టడం ద్వారా నన్ను ఇబ్బంది పెట్టవచ్చు.
కానీ నా ఆత్మను విచ్ఛిన్నం చేయలేరు అని ట్వీట్ చేశారు.భారతీయ స్వాతంత్ర్య సమరయోధులు బ్రిటిష్ వారితో ఇబ్బందులు పెట్టిన నాటి రోజులను సిసోడియా గుర్తు చేసుకున్నారు.
అయితే మద్యం కుంభకోణం కేసులో దాదాపు ఎనిమిది గంటల విచారణ అనంతరం ఫిబ్రవరి 26న మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది
.