టాలీవుడ్ ఉన్న క్యూట్ కపుల్స్ లో హీరో మహేష్ బాబు, నమ్రత జంట కూడా ఒకటి.వంశీ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి భార్యాభర్తలు గా మారిన విషయం తెలిసిందే.
పెళ్లయి కొన్ని ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికి ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఎంతోమందికి ఆదర్శంగా కూడా నిలుస్తున్న విషయం తెలిసిందే.మహేష్ బాబు స్టార్ హీరోగా రాణిస్తూ వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుండగా మరొకవైపు నమ్రత కోడలుగా ఏంటి బాధ్యతలను చేపడుతూనే మహేష్ బాబుకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు అన్ని చూసుకుంటూ ఉంటుంది.

ఇక సామాజిక సేవా కార్యక్రమాలలోనూ ఇద్దరు ముందే ఉంటారని చెప్పవచ్చు.మహేశ్ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే కొన్ని వందల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ల చేయించి అండగా నిలిచారు మహేష్.నమ్రత కూడా అప్పుడప్పుడు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది.తాజాగా నమ్రతా శిరోద్కర్ తన గొప్ప మనసును చాటుకుంది.అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా ఓ పేద విద్యార్థినికి అండగా నిలిచారు.
ఏవియేషన్ చదువుకునేందుకు ల్యాప్ టాప్ అందించారు.బాగా చదువుకుని మీ కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకురావాలని నమ్రతా విద్యార్థికి సూచించారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ వీడియోని చూసిన ఘట్టమనేని అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.నమ్రత సహాయం చేసిన సందర్బంగా నమ్రత చేసిన సహాయంపై ఏవియేషన్ విద్యార్థి, ఆమె తండ్రి కృతజ్ఞతలు తెలిపారు.నా చదువుకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న మహేశ్ బాబు ఫ్యామిలీకి నేను రుణపడి ఉంటాను అని తెలిపింది సదరు విద్యార్థి.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.







