సినిమా ఇండస్ట్రీలో ప్రేమ,పెళ్లి,విడాకులు ఇవన్నీ కామన్ అని చెప్పవచ్చు.సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎంతో మంది విడాకులు తీసుకుని విడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే.
ఏళ్ళ తరబడి ప్రేమించుకున్న కొందరు సెలబ్రిటీ జంటలు పెళ్లైన ఏడాదికే విడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.అలా ఇటీవల అతను మరో సెలబ్రిటీ జంట కూడా విడిపోవడానికి సిద్ధపడింది.
ఆ జంట మరెవరో కాదు ప్రముఖ యాంకర్,తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్, నటి అర్చన చందోక్, ఆమె భర్త వినీత్ విడాకులు తీసుకుని విడిపోవడానికి సిద్ధపడినట్లు ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే.

దాదాపుగా ఇరవై ఏళ్లుగా కలిసి జీవిస్తున్న అర్చన, వినీత్ జంట విడిపోవాలని నిర్ణయించుకుంది.అయితే ఇందుకోసం విడాకులు పత్రాలను కూడా సిద్ధం చేసుకుంది.కానీ ఆఖరి నిమిషంలో తన మనసు మార్చుకుంది.
కాగా ఇదే ఈ విషయాన్ని తాజాగా ఆమె షోలో చెబుతూ కన్నీరు పెట్టుకుంది.తాజాగా షోలో తన వివాహం గురించి మాట్లాడుతూ.
మీ అందరికీ ఒక నిజాన్ని చెప్పాలి అనుకుంటున్నాను.ఒక నెల రోజుల క్రితం నేను, నా భర్త విడిపోదామని ఓ నిర్ణయానికి వచ్చాము.
మా మధ్య పదే పదే భేదాభిప్రాయాలు వస్తుండటం, గొడవలు అవుతుండటంతో కలిసి ఉండటం జరగని పని అని విడాకులు తీసుకుందామని నిర్ణయించుకున్నాము.విడాకుల పత్రాలను కూడా మేము రెడీ చేసుకున్నాం.

కానీ మా కూతురు మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడింది.మమ్మల్ని ఇద్దరిని తిరిగి కలిపింది.పదిహేను రోజుల క్రితం వినీత్ వైజాగ్ ట్రాన్స్‌ఫర్ అయ్యాడని మెసేజ్ వచ్చింది.అప్పుడు నన్నెవరో చెంప మీద లాగిపెట్టి కొట్టినట్లు అనిపించింది.అయితే బిగ్‌బాస్ తర్వాత నామీద నెగెటివిటీ పెరిగింది.బాత్రూమ్ టూర్ వీడియో చేశాక నన్ను మరింత విమర్శించారు.
ఇంతలో నా భర్త నాకు దూరమవుతున్నాడు.ఇవన్నీ నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి.
ఆ సమయంలో జారా మాకు జ్ఞానోదయం చేసింది.మేమిద్దరం ఒకరిని విడిచిపెట్టి ఒకరం ఉండలేమని చెప్పింది.
అప్పటిదాకా గొడవలతో కోపాన్ని పెంచుకున్న మా కళ్లల్లో ఒక్కసారిగా ప్రేమవర్షం కురిసింది.ఇప్పుడు నేను నా భర్తను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పుకొచ్చింది అర్చన.







