రాజకీయాలపై ఆసక్తి లేదన్న మంచు విష్ణు.. ఎంపీ, ఎమ్మెల్యేగా గెలుస్తానంటూ?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మంచు విష్ణు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ మా అధ్యక్ష పదవికి ఎంపికైతే చేసే అభివృద్ధి గురించి చెబుతున్నారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల సంఖ్య 900 కాగా ఇప్పటికే 778 మంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులతో తాను వ్యక్తిగతంగా మాట్లాడానని విష్ణు వెల్లడిస్తున్నారు.

మిగతా వాళ్లలో కొంతమంది అందుబాటులో లేరని మంచు విష్ణు పేర్కొన్నారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ జరుగుతుందని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.

ఇతరుల ప్యానెళ్లలో ఉన్నవాళ్ల ఓట్లు సైతం తనకే పడతాయని విష్ణు ధీమా వ్యక్తం చేశారు.ఇప్పటికే నామినేషన్ ను దాఖలు చేసిన మంచు విష్ణు తన విజయం క్రాస్ ఓటింగ్ పై ఆధారపడి ఉంటుందని తెలిపారు.

చాలామంది తనతో నిజాయితీగా మాట్లాడారని విష్ణు చెప్పుకొచ్చారు.వృత్తిపరంగా తాము వేరే కాంపౌండ్ లో ఉన్నా తనకే ఓటు ఖచ్చితంగా వేస్తామని చెప్పారని విష్ణు వెల్లడించారు.

Advertisement

ఈ ఎన్నికలను తాను సీరియస్ గా తీసుకున్నానని ఇంతే సీరియస్ గా కష్టపడితే ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా కూడా గెలుస్తానని విష్ణు కామెంట్లు చేశారు.అయితే తనకు పాలిటిక్స్ పై ఏ మాత్రం ఆసక్తి లేదని విష్ణు చెప్పుకొచ్చారు.ఈ పదవిని పాలిటిక్స్ లోకి వెళ్లడానికి ఎంట్రీ అని తాను అనుకోవడం లేదని విష్ణు చెప్పుకొచ్చారు.

పాలిటిక్స్ లోకి తన ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా లాగుతున్నారని అది కూడా తనకు ఇష్టం లేదని మంచు విష్ణు తెలిపారు.

కొన్ని పొలిటికల్ పార్టీలు ప్రకాష్ రాజ్ నుంచి ఎన్నికల్లో ప్రవేశించినట్టు విష్ణు చెప్పుకొచ్చారు.రాజకీయ పార్టీలు మా ఎన్నికల్లోకి ఎంట్రీ ఇవ్వడం సరికాదని మంచు విష్ణు వెల్లడించారు.కొందరు పొలిటీషియన్స్ ప్రకాష్ రాజ్ తరపున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు ఫోన్ చేస్తున్నారని విష్ణు ఆరోపణలు చేశారు.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు