కన్నప్పలో ప్రభాస్ రోల్ గురించి మంచు విష్ణు క్లారిటీ ఇదే.. ఏం చెప్పారంటే?

ప్రముఖ నటుడు మంచు విష్ణు( manchu vishnu ) కన్నప్ప పాత్రలో కన్నప్ప టైటిల్ తో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా గురించి, ప్రభాస్ రోల్ గురించి మంచు విష్ణు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

కన్నప్ప మూవీ( kannappa movie ) షూట్ ఇప్పటివరకు 60 శాతం పూర్తైందని ఆయన అన్నారు.ఈ సినిమా రిలీజ్ గురించి నార్త్ ఆడియన్స్ కూడా అడుగుతున్నారని విష్ణు పేర్కొన్నారు.

2024 చివర్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని మంచు విష్ణు అభిప్రాయం వ్యక్తం చేశారు.త్వరలోనే కన్నప్ప గ్లింప్స్ ను రిలీజ్ చేస్తామని ఇందులో ప్రభాస్ రోల్ అద్భుతంగా ఉంటుందని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.ప్రభాస్ రోల్( prabhas role ) కు సంబంధించిన వివరాలను ఇప్పుడే చెప్పలేనని ఆ విషయాలను చెప్పేస్తే థ్రిల్ ఉండదని మంచు విష్ణు అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

సమయం వచ్చినప్పుడు వివరాలను వెల్లడిస్తానని ఆయన కామెంట్లు చేశారు.మరో నెలలో న్యూజిలాండ్ కు వెళ్లాలని మిగిలిన షూటింగ్ కూడా అక్కడే చేస్తామని విష్ణు పేర్కొన్నారు.మోహన్ బాబు, నా కొడుకు ఆవ్రామ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని విష్ణు వెల్లడించడం గమనార్హం.

Advertisement

ఈ సినిమాతో ప్రీతి ముకుందన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నారు.

శివరాజ్ కుమార్( Shiva Rajkumar ), మోహన్ లాల్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.కన్నప్ప మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని మంచు విష్ణు బలంగా నమ్ముతున్నారు.కన్నప్ప మూవీకి రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కన్నప్ప మూవీ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాలి.ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతుండటం గమనార్హం.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు