టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నటువంటి మంచు మనోజ్ ( Manchu Manoj ) ప్రస్తుతం తన వృత్తిపరమైనటువంటి జీవితంలోనూ అలాగే వైవాహిక జీవితంలోని ఎంతో సంతోషంగా గడుపుతున్న సంగతి తెలిసిందే.ఈయన గత ఏడాది మార్చి 3 వ తేదీ భూమా మౌనిక రెడ్డి ( Bhuma Mounika Reddy ) ని రెండవ వివాహం చేసుకున్నారు.
అత్యంత సన్నిహితుల కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది.ఇక వీరి వివాహం జరిగి ఏడాది కావడంతో తమ వెడ్డింగ్ యానివర్సరీని మనోజ్ దంపతులు ఎంతో ఘనంగా జరుపుకున్నారు.
ఈ క్రమంలోనే మనోజ్ సోషల్ మీడియా వేదికగా తన భార్య మౌనిక, కుమారుడు ధైరవ్ తో కలిసి ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన భార్యకు పెళ్లి రోజు( Wedding day ) శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.నా ప్రియమైన భార్య భూమా మౌనికకు మొదటి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.ప్రతిరోజు ప్రేమ ఆనందంతో కూడిన ప్రయాణం ఇది.మీ ఉనికి నా జీవితానికి ప్రేమ ఒక సాంగత్యంతో అసాధారణంగా మార్చివేసింది.
మీ తల్లిదండ్రులు లేని లోటును నేను భర్తీ చేయలేను, వారి జీవితంలో అత్యంత విలువైన వారిని సంరక్షిస్తానని, వాగ్దానం చేస్తున్నాను.మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నా ప్రాణాలను ఫణంగా పెట్టి మిమ్మల్ని కాపాడుతానని మాట ఇస్తున్నాను.ఇక్కడ మా కుటుంబానికి అనేక మధుర జ్ఞాపకాలు ఉన్నాయి.నా భార్య మణికి పెళ్లి రోజు శుభాకాంక్షలు.మీరు నా హృదయంలో, ఆత్మలో అత్యంత విలువైన భాగం ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను ఇట్లు మను అంటూ తన భార్యకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అని తెలియజేస్తూ తనపై ఉన్నటువంటి ప్రేమను బయటపెడుతూ మనోజ్ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
.