రాజకీయం సరే.. మంచు బాబు సినిమా సంగతి ఏంటో క్లారిటీ ఏది?

మంచు ఫ్యామిలీ నుండి మోహన్‌ బాబు వేసిన దారి లో మంచు విష్ణు, మనోజ్‌, మంచు లక్ష్మి ముగ్గురు కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన విషయం తెల్సిందే.

తండ్రి మాదిరిగా వీరు ముగ్గురు కూడా సక్సెస్‌ అవ్వలేక పోయారు.

ముగ్గురికి ముగ్గురు కూడా సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒక హాట్ టాపిక్ తో వార్తల్లో నిలుస్తూ ఉంటారు.ముఖ్యంగా ఇండస్ట్రీలో మంచు విష్ణు( Manchu Vishnu ) గురించి ట్రోల్స్ ఎప్పుడు ట్రెండ్‌ అవుతూనే ఉంటాయి.

ఆ విషయం పక్కన పెడితే వీరు ముగ్గురు కూడా సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.ముగ్గురికి ముగ్గురు కూడా సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్ గా లేకపోవడంతో విమర్శలు వస్తున్నాయి.

ముఖ్యంగా మంచు మనోజ్( Manchu Manoj ) సినిమా వచ్చి మూడు నాలుగు సంవత్సరాలు అయింది.అయినా ఇప్పటి వరకు కొత్త సినిమా ఎప్పుడు వస్తుంది అనేది క్లారిటీ ఇవ్వలేదు.కొత్త సినిమా విషయం లో ఆ మధ్య హడావుడి చేసిన మనోజ్ ఇప్పుడు సైలెంట్ అయ్యాడు.

Advertisement

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు దేశం పార్టీ లో( TDP ) మనోజ్ జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.అదే నిజం అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఆశ్చర్యం లేదు.

దాంతో సినిమా ఇండస్ట్రీ లో ఆయన సందడి పరిస్థితి ఏంటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇంతకు మోహన్ బాబు వారసుడు మంచు మనోజ్‌ సినిమా ఇండస్ట్రీ లో కొనసాగితే రాజకీయాలు( Politics ) చేస్తాడా అనేది చర్చ.మౌనిక మాత్రమే రాజకీయాల్లో ఉండి మనోజ్ సినిమా ల్లో కొనసాగుతాడా అనేది తెలియాల్సి ఉంది.మొత్తానికి మంచు మనోజ్ సినిమా ఇండస్ట్రీ లో కొనసాగే విషయం లో క్లారిటీ లేక మంచు వారి అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు.

ఇక మంచు మనోజ్ సినిమా ఇండస్ట్రీ లో కొనసాగుతూనే వైకాపా తో సన్నిహిత్యంగా మెలుగుతున్న విషయం తెల్సిందే.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు