మంచు ఫామిలీ మోస్ట్ అగ్రెసివ్ మ్యాన్ గా పేరు సంపాదించుకున్నాడు మంచు మనోజ్.( Manchu manoj ) మొదటి నుంచి కాస్త దూకుడు గా ఉండే మనోజ్ పెరిగే కొద్దీ మరింత యాంగ్రీ మ్యాన్ గా తయారయ్యాడు.
చిన్న చిన్న విషయాలు బయట పెట్టుకోవడం వల్ల కలిగే లాభం కంటే నష్టమే ఎక్కవ.ప్రతి ఇంట్లో వివాదాలు ఉంటాయి.
కానీ అవి సోషల్ మీడియాలో పెట్టుకోవడం ఎంత వరకు సబబు అంటూ మంచి అభిమానులు సైతం నివ్వెర పోయే విధంగా వ్యవహరిస్తునందు మనోజ్.అయితే ఇలా కోపం లో ఎదో ఒకటి చేసెయ్యడం, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం అనేది మనోజ్ కి మొదటి నుంచి ఉన్న అలవాటే.

సినిమాల ఎంపిక లో పొరపాట్లు చేస్తే కేవలం కెరీర్ మాత్రమే పోతుంది కానీ జీవితంలో పొరపాట్లు చేసి తొందర పడితే మొత్తం కుటుంబం పరువు, భవిష్యత్తు, ఇన్నాళ్ళుగా కాపాడుకున్న గౌరవం అన్ని మంటగలిసి పోతాయ్.ఇప్పటి వరకు తన సినిమాల విషయంలో కూడా ఎవరు జోక్యం చేసుకునే వారు కాదు.అందుకే ఈ రోజు ఒక్క సినిమా కూడా చేయలేని స్థితిలో అతడు ఉన్నాడు.ఇక పెళ్లి విషయం లో ఇలాంటి ఒక తొందర పాటు నిర్ణయం తీసుకున్నాడు.
మొదట ప్రణతి రెడ్డి అనే సాఫ్ట్ వెర్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.అతడి నిర్ణయాన్ని కుటుంబం స్వాగతించింది.కానీ చిన్న చిన్న వివాదాలు పెద్దవి కావడం , వరసగా సినిమాలు పరాజయం పాలవ్వడం తో ప్రణతి అమెరికా కు తనతో పాటు రమ్మని చెప్పిన వినకపోవడం వంటివి జరిగాయి.దాంతో విడాకులు తప్పలేదు.

ఇక రెండవ వివాహం కేవలం ఒక అక్క లక్ష్మి సమ్మతం తో మాత్రమే జరిగింది.ఒక బిడ్డ తల్లిని కోడలిగా తెస్తాను అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు చెప్పండి.అయినా కూడా మనోజ్ ని ఆపలేము అని అర్ధం అయ్యాక పెళ్ళికి కుటుంబం మొత్తం అతిధులుగా వచ్చి వెళ్లిపోయారు .ఒకసారేమో తాను సినిమాల నుంచి తప్పుకుంటున్నట్టు ట్వీట్ చేసి అది డిలీట్ చేసాడు.మరోసారి త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్న అని ప్రకటించి అందరికి షాకిచ్చాడు.ఇక ఇప్పుడు ఈ గొడవల విషయం కూడా అచ్చు అలాంటిదే.చిన్న విషయాన్నీ రచ్చ చేసి ఇదిగో ఈ రోజు మీడియాలో వార్త గా మిగిలిపోయాడు.







