మనోజ్, మౌనికల మెహందీ వీడియో వైరల్.. అతిథులకు అలాంటి విందు?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో వినిపిస్తున్న పేర్లు భూమా మౌనిక మంచు మనోజ్.ఈ పేర్లు సోషల్ మీడియాలో మారు మోగిపోతున్నాయి.

ఇటీవల ఫిలింనగర్ లోని మంచు లక్ష్మి నివాసంలో శుక్రవారం రాత్రి 8:30కు మంచు మనోజ్, భూమా మౌనికల వివాహం జరిగిన విషయం తెలిసిందే.ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

అంతే కాకుండా విరికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.కాగా పెళ్లి ఫోటోలను మంచు లక్ష్మి ఇప్పటికే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి మనోజ్ మౌనికల మెహందీ వేడుకలకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇక ఆ వీడియోలో మంచు లక్ష్మి మెహందీ వేడుకల గురించి అలాగే డిజైన్స్ గురించి ఏర్పాట్ల గురించి తెలిపింది.అంతేకాకుండా అతిధుల కోసం ఏర్పాటు చేసిన వంటకాలను రుచి చూసి మరి రివ్యూ ఇచ్చింది.

Advertisement

ఇక వీడియో ఎంట్రింగ్ లోనే తన ఇంటి దగ్గర ఉన్న మామిడి చెట్టు దగ్గర నిలబడి ఈ చెట్టుకు మామిడికాయలు చాలా కాలుతాయి అందుకే ఈ చెట్టుకు అలంకరణ చేసేటప్పుడు ఒక్క మామిడికాయ కింద పడ్డ తలకాయలు లేపిస్తానని చెప్పాను అందుకే చాలా జాగ్రత్తగా చేస్తున్నారు అంటూ నవ్వుతూ తెలిపింది.

కాగా ఆ వీడియోలో తన ఇంటి దగ్గర ఉన్న మామిడికాయ చెట్టు ఎంతో అందంగా అలంకరిస్తున్నారు.మెహేంది వేడుకకు వచ్చే అతిధుల కోసం రకరకాల విందును ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపింది.అతిథుల కోసం రాజస్థాన్‌ స్పెషల్‌ చాట్‌తో పాటు పలు రకాల పానీ పూరిలను ఏర్పాటు చేయించినట్టు తెలిపింది.

ఇక వీడియో తీస్తూ అందులో కొన్నింటిని ఆమె రుచి చూశారు.అయితే ఎవరీ తెలియకుండా పారీపూరిలో ఓడ్కా కలుపుతానని మంచు లక్ష్మి సరదాగా నవ్వుతూ తెలిపింది.ఈ మెహందీ వేడుకకు సంబంధించిన వీడియోని తన యూట్యూబ్ ఖాతాలో షేర్ చేసింది.

ఈ వీడియోని చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు