మనోజ్‌ ఎంగేజ్మెంట్‌ ఎప్పుడంటే..!

మంచు హీరో మనోజ్‌ త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్న విషయం తెల్సిందే.ఈ విషయాన్ని కొన్ని రోజుల క్రితం మోహన్‌బాబు అధికారికంగా ప్రకటించాడు.

మనోజ్‌ పెళ్లి ప్రణతితో జరిపించబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.మనోజ్‌, ప్రణతిలు గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారట.

ఇరు కుటుంబాలు కూడా వీరి ప్రేమకు ఒప్పుకుని పెళ్లి జరిపించేందుకు సిద్దం అయ్యారు.ఇక తాజాగా ఈ సినిమా నిశ్చితార్థం డేటును ఖరారు చేశారు.

ప్రస్తుతం అమెరికాలో సీపీఏ చేస్తోన్న ప్రణతితో మంచు మనోజ్‌కు మార్చి 4న వివాహ నిశ్చితార్థం జరుపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ విషయాన్ని మంచు ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించింది.

Advertisement

సినీ మరియు రాజకీయ ప్రముఖులను ఈ నిశ్చితార్థ వేడుకకు ఆహ్వానిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది.ఇక పెళ్లి కూడా ఆ వెంటనే జరిపించే ఆలోచనలో ఇరు కుటుంబాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ ఇయర్ లో బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తున్న మన స్టార్ హీరోలు...
Advertisement

తాజా వార్తలు