యంగ్‌టైగర్ ఎన్టీఆర్, కాజల్ జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టెంపర్’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.ఈ సినిమాపై యూనిట్ సభ్యులు భారీ స్థాయిలో అంచనాలు పెంచారు.
నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసుకుని తిరిగేలా ఈ సినిమా ఉంటుందని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.ఆ స్థాయిలోనే ఈ సినిమా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.
ఇక ఈ సినిమాపై సినీ ప్రముఖులు కూడా పలువురు ట్వీట్స్ చేశారు.రాజమౌళి ఈ సినిమా గురించి ప్రత్యేకంగా స్పందించాడు.
హైదరాబాద్ బ్రమరాంభ థియేటర్‌లో బెనిఫిట్ షో చూసిన రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ మరియు ఇతర సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు.పూరి టేకింగ్, ఎన్టీఆర్ నటనపై జక్కన్న సూపర్ అంటూ కామెంట్స్ చేశాడు.
ఎన్టీఆర్‌కు మంచి సక్సెస్ దక్కిందని రచయిత గోపీ మోహన్ ట్వీట్ చేశాడు.అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారని సినీ ప్రముఖులు అంటున్నారు.







