సినీ ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలకు పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు అనే సంగతి మనకు తెలిసింది కొన్నిసార్లు అభిమాన హీరోలను కలవడం కోసం సినిమా ఈవెంట్ లో జరుగుతున్నటువంటి సమయంలో అభిమానులు ఒక్కసారిగా వేదిక మీదకు దూసుకుపోతూ ఆ హీరోల కాళ్ళపై పడుతూ వారితో సెల్ఫీలు దిగడానికి ఆరాటపడుతూ ఉంటారు.ఇలా ఇప్పటికే ఎంతోమంది హీరోల అభిమానులు ఇలా వేదిక పైకి దూసుకు వచ్చిన సంఘటనలను మనం చూసే ఉన్నాము.
కానీ హీరోయిన్లకు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురు కాలేదు.

తాజాగా మంచు లక్ష్మి( Manchu Lakshmi ) ప్రధాన పాత్రలో నటించిన సోషియో ఫాంటసీ చిత్రం ఆదిపర్వం( Adi Parvam ) ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిన్న జరిగింది.ఇక ఈ ఫంక్షన్ జరుగుతుండగా ఒక కుర్రాడు వేదిక పైకి పరిగెడుతూ వస్తూ లక్ష్మి మంచు కాళ్లపై పడి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.ఇలా అభిమాని పరిగెత్తుతూ రావడంతో లక్ష్మి మంచు ఒక్కసారిగా షాక్ కి గురైంది.
లక్ష్మి వెంటనే వెనక్కి జరిగి అవాక్కయింది.ఓకే నాన్న చాలు.
అక్కడికెళ్లు నేను మాట్లాడతా అంటూ మంచు లక్ష్మి భయంతో కూడిన ఆశ్చర్యం వల్ల వచ్చిన ఓ వింత ఎక్స్ప్రెషన్ పెట్టింది.

ఇలా అభిమాని కాళ్ళపై పడటంతో ఈమె నా మీద ఇంత ప్రేమ ఉందా అంటూ మురిసిపోయింది.ఇక ఆ తర్వాత ఆ కుర్రాడితో కలిసి ఈమె సెల్ఫీలకు ఫోజులు ఇవ్వడంతో ఆ కుర్రాడు కన్నీళ్లు తుడుచుకుంటూ ఎంతో ఎమోషనల్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు.ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సోషల్ మీడియా వేదికగా లక్ష్మీ మంచు పై భారీ స్థాయిలో ట్రోల్స్ వస్తున్నాయి.
అక్క ఇదంతా మీ ప్లానే కదా డబ్బులు ఇచ్చి బాగానే సెట్ చేశావు అక్క అంటూ కొందరు ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.మరి కొందరు లక్ష్మీ మంచుకు కూడా ఈ స్థాయిలో క్రేజ్ ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.