తెలుగు రాష్ట్రాల్లో( Telugu States )ని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి.ఈ మేరకు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు మరియు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.అలాగే ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు( Heavy Rains ) పడనున్నాయని తెలుస్తోంది.ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ( Weather Department ) సూచిస్తుంది.