మోహన్ బాబు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి మంచు లక్ష్మీ ( Manchu Lakshmi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో సినిమాలలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా మారిపోయారు.
ఈ విధంగా మంచు లక్ష్మి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.తాజాగా సైమా అవార్డు ( Siima Award ) ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా సెలబ్రిటీలందరూ కూడా దుబాయ్ లో సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే మంచు లక్ష్మి అక్కడ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా యాంకర్ తనని ప్రశ్నిస్తూ ఉండగా ఓ వ్యక్తి కెమెరాకు అడ్డుగా వచ్చారు.దీంతో మండిపడినటువంటి మంచు లక్ష్మి ఆ వ్యక్తిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.నీ యవ్వ పక్కకు తప్పుకో అంటూ సీరియస్ గా ఆ వ్యక్తిని లాగిపెట్టి ఒకటి కొట్టారు.
అలాగే మరో వ్యక్తి కూడా కెమెరా ముందు నుంచి వెళ్తూ ఉండగా ఆ వ్యక్తికి కూడా తన స్టైల్ లో మాస్ వార్నింగ్ ఇచ్చింది.కెమెరా వెనకనుంచి వెళ్ళండి దూడ్ అంటూ మంచు లక్ష్మి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇలా మంచు లక్ష్మి వారికి మాస్ వార్నింగ్ ఇవ్వగా యాంకర్ మాత్రం వీటిని ఎడిటింగ్ చేయండి అన్నట్టు సైగ చేశారు కానీ మంచు లక్ష్మి అలాగే ఉండనివ్వండి అంటూ చెప్పడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో పై నెటిజన్స్ స్పందిస్తూ లక్ష్మీ మంచుకి మద్దతు తెలపగా మరికొందరు మాత్రం విమర్శలు చేస్తూ ఉంటారు.అయితే ఏదైనా ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు కెమెరాకి అడ్డుగా వెళ్ళకూడదు అనేది మినిమం కామన్ సెన్స్ అని, ఆ మాత్రం కూడా తెలియకుండా అడ్డుగా వెళ్తే ఎవరికైనా కోపం రాదా అంటూ మంచు లక్ష్మి కి సపోర్ట్ చేస్తున్నారు.
.