టాలీవుడ్ లో మంచు మోహన్ బాబు కి ప్రత్యేక స్థానం ఉంది అనడంలో సందేహం లేదు.ఆయన నటించిన సినిమాలు, పోషించిన పాత్రలు, నిర్మించిన చిత్రాలు.
ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆయన స్థాయిని అమాంతం పెంచాయి.కమెడియన్ గా, విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.ఎన్నో వైవిధ్య భరిత పాత్రలను పోషించి టాలీవుడ్ లెజెండ్ అన్నట్లుగా పేరు దక్కించుకున్న మోహన్ బాబు ఈ మధ్య కాలంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు.ఆయన సినిమాల ఎంపిక విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అంతే కాకుండా ఆయన కొడుకులు ఇద్దరు మంచు విష్ణు మరియు మంచు మనోజ్ లు సినిమాల ఎంపిక విషయంలో ప్రయోగాత్మకంగా కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న రెగ్యులర్ రొటీన్ సినిమాలను చేయాలని, వాటి ద్వారా సక్సెస్ లను దక్కించుకొని ఆ తర్వాత ప్రయోగాత్మక సినిమాలు చేసి అప్పుడు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని మంచు ఫ్యామిలీ యొక్క అభిమానులు కోరుకుంటున్నారు.ఫ్యామిలీ అభిమానులు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వారికి మద్దతుగా నిలుస్తున్నారు.
కొందరు యాంటీ ఫ్యాన్స్ మోహన్ బాబు మరియు విష్ణు లపై తీవ్రమైన విమర్శలు చేస్తూ ట్రోల్స్ చేయడం జరుగుతుంది.అది ఫ్యామిలీ ఫ్యాన్స్ కి ఆవేదన కలిగించే విషయం, అందుకే వారు మంచు ఫ్యామిలీకి పూర్వ వైభవం కావలెను అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.అందుకోసం మంచి ఫ్యామిలీ హీరోలు వెంటనే మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం ద్వారా కొన్ని సినిమాలైనా అందులో సక్సెస్ అయితే సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆగుతాయి అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి మంచు ఫ్యామిలీకి పూర్వ వైభవం సాధ్యమేనా అనేది కాలమే సమాధానం చెప్పాలి.