టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో అల్లు కుటుంబం ఒకటి.ఇండస్ట్రీలో అల్లు అరవింద్ నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగా ఆయన వారసుడిగా అల్లు అర్జున్ ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో మరింత గుర్తింపు పొందారు.
ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడంతో ఈయనకు ఇండస్ట్రీలో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది.ఇకపోతే ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఎన్నో విషయాల గురించి ముచ్చటించారు.
ఈ క్రమంలోనే తన కొడుకుల ఎదుగుదల చూసి ఈయన ఎంతో మరిచిపోయారు.
సినిమా ఇండస్ట్రీలో అల్లు అనే పేరుకు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.నటుడు అల్లు రామలింగయ్య ఇండస్ట్రీలో హాస్యనటుడిగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇకపోతే ఈయన వారసుడిగా అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి ఎన్నో అద్భుతమైన సినిమాలను తీసుకువస్తూ అల్లు అనే పేరుకు మరింత వ్యాల్యూ తీసుకువచ్చారు.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఇంటి పేరు ఉంటుంది అయితే ఆ ఇంటి పేరును ఒక బ్రాండ్ గా మార్చడం ఏ కొందరికో సాధ్యమవుతుంది.
ఇలా తన తండ్రి గారికి అల్లు అనే పేరు అంటే ఎంతో ఇష్టమని అయితే ఆ పేరు ఇప్పుడు బ్రాండ్ గా మారడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ అరవింద్ పేర్కొన్నారు.ఆయన వారసుడిగా అల్లు అనే పేరును తాను మరింత ముందుకు తీసుకెళ్లగా అల్లు అర్జున్ మాత్రం పుష్ప సినిమా ద్వారా అల్లు అనే పేరుకు ఒక బ్రాండ్ తీసుకువచ్చారని ఈ పేరును ఉన్నత శిఖరాలకు చేర్చారు అంటూ ఈ సందర్భంగా అల్లు అరవింద్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఈ విధంగా ఈయన అల్లు అర్జున్ క్రేజ్ ఆయన సాధించిన విజయం పట్ల ఎంతో సంబరపడ్డారు.