సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేము.తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారింది.
ఈ వీడియో ఓపెన్ చేస్తే మనకు ఒక స్టోర్( Store ) కనిపిస్తుంది.అందులో ఒక కస్టమర్ లేదా స్టోర్ సిబ్బంది నిల్చుని ఉన్నాడు.
ఇంకొక కస్టమర్ ఒక వీల్ చైర్ లో( Wheel Chair ) కనిపించాడు.అతడికి చేతులు లేవు.
కాళ్లు మాత్రం మంచిగానే ఉన్నాయి.ఆ కాళ్లతోనే అతడు గన్ను పట్టుకొని స్టోర్ యజమానిని భయపెడుతున్నట్లు కనిపించింది.
కాళ్లతోనే ఆ పిస్తోల్( Pistol ) హ్యాండిల్ చేస్తూ వీల్ ఛైర్ అటూ ఇటూ తిప్పుతూ తన టార్గెట్ ను అతడు భయపెడుతున్నట్లు తెలిసింది.స్టోర్ లోని కౌంటర్ వద్ద ఉన్న యజమానికి ఇతడు తుపాకీ గురిపెడుతూ డబ్బులు అడిగాడు.దాంతో స్టోర్ లో ఉన్న సదరు వ్యక్తి చేతులు పైకి లేపుతూ సరెండర్ అయినట్లు సంకేతం ఇచ్చాడు.ఆపై అక్కడ నుంచి అతడు వేరే వైపు వెళ్లిపోయాడు.
ఈ సమయంలో వీల్ ఛైర్‌లో ఉన్న దివ్యాంగుడు( Disabled Person ) తన కాళ్ళతోనే తుపాకీ లో మ్యాగజైన్ వేసి దానిని లోడ్ చేసి టార్గెట్ అయిమ్ చేయడం మనం వీడియోలో చూడవచ్చు.
చేతులు లేకపోయినా అతను ఇలా దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తూ అందరినీ షాక్‌కి గురి చేశాడు.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇది ఫేక్ అయి ఉండొచ్చని కామెంట్లు పెడుతున్నారు.ఏదేమైనా ఇది చూసేందుకు మాత్రం నమ్మలేనటువంటి విధంగా ఉంది.@PictureFoIder ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే కోటి పదిలక్షల పైగా వ్యూస్ వచ్చాయి.40 వేలకు పైగా లైకులు వచ్చాయి.దీని మీరు కూడా చూసేయండి.