పులిని చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది.ఎదురుపడితే సగం ప్రాణాలు పోయినట్టు అనిపిస్తాయి అలాంటిది.
ఓ చిరుత పులిని మేకను కట్టినట్టు బైకు తాళ్ళతో కట్టి తీసుకువెళ్లి అటవీ శాఖ సిబ్బందికి అప్పగించాడు విద్య ఓ వ్యక్తి.ఈ ఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లాలో వెలుగు చూసింది.హాసన్ జిల్లా బాగివాలు గ్రామానికి చెంది ముత్తు అనే రైతు తన పొలానికి వెళ్తుండగా,
ఓ చిరుత పులి అడ్డొచ్చి రైతుపై దాడి చేసింది.వెంటనే అప్రమత్తమైన ఆ రైతు పారిపోకుండా చిరుతపై ఎదురుదాడి చేశాడు.
తన వద్ద ఉన్న తాడుతో దాని కాళ్లను కట్టేశాడు.అనంతరం చిరుతను బైక్ వెనక భాగాన కట్టి నేరుగా అటవీ శాఖ కార్యాలయానికి వెళ్లి అప్పగించాడు.
దీంతో ఆశ్చర్యపోయిన సిబ్బంది చిరుతను స్వాధీనం చేసుకొని వైద్య చికిత్స అందిస్తున్నారు.