అఫిషియల్ : VD13 కూడా సంక్రాంతికే.. రిలీజ్ డేట్ ఫిక్స్.. షూట్ స్టార్ట్!

యంగ్ హీరోల్లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) ఒకరు.ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దీ సమయంలోనే భారీ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుని మరో మెట్టు ఎక్కితే స్టార్ హీరోల సరసన చేరిపోతాడు.

 Vd13 Shoot Began Today Movie To Release For Sankranthi 2024-TeluguStop.com

తాను నటించిన గత సినిమా లైగర్ కనుక హిట్ అయి ఉంటే ఇప్పటికే స్టార్ హీరో అయిపోయి ఉండే వాడు.కానీ అలా జరగలేదు.

యంగ్ హీరోల్లో భారీ ఫాలోయింగ్ తో దూసుకు పోతున్న విజయ్ లైగర్ వంటి ప్లాప్ తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి వరుస సినిమాలను లైనప్ చేసుకున్నాడు.అందుకే విజయ్ కొత్త సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఖుషి వంటి లవ్ స్టోరీని రెడీ చేసి పెట్టాడు.సెప్టెంబర్ 1న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.div class=”middlecontentimg”>

ఇక ఆ సినిమా షూట్ కూడా ముగియడంతో తన తదుపరి సినిమా షూట్ వెంటనే స్టార్ట్ చేసాడు.ఇటీవలే విజయ్ కొత్త సినిమాను లాంచ్ చేసిన విషయం విదితమే.విజయ్ కు గీతా గోవిందం వంటి ఘన విజయం అందించిన పరశురామ్ తో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ఈ రోజు షూట్ స్టార్ట్ చేసినట్టు చెబుతూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసారు.

అంతేకాదు షూట్ తో పాటు రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చేసారు.ఈ సినిమాలో విజయ్ కు జోడిగా మృణాల్ ఠాకూర్( Mrunal Thakur) హీరోయిన్ గా నటిస్తుండగా ”VD13” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

మరి దిల్ రాజు అంటే సంక్రాంతి సీజన్ ను అస్సలు మిస్ చేసుకోరు అనే విషయం అందరికి తెలుసు.div class=”middlecontentimg”>

మరి ఈసారి కూడా దిల్ రాజు విజయ్ – పరశురామ్( Parasuram )సినిమాను 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.ఇప్పటికే 2024 సంక్రాంతికి భారీ సినిమాలు లైన్లో ఉన్నాయి.అయిన కూడా దిల్ రాజు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

చూడాలి చివరికి ఎవరు ఈ రేస్ లో ఉంటారో.ఎవరు తప్పుకుంటారో.

ఇక గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube