కరోనా వంక తో ఆఫీస్ కు డుమ్మా,చివరికి

ఒకపక్క కరోనా మరణాలతో ప్రపంచదేశాలు వణికిపోతుంటే, కొందరు మాత్రం దానిని తమ ప్రయోజనము కోసం ఉపయోగించుకుంటున్నారు.

ఈ కరోనా సోకింది అంటూ ఒక వ్యక్తి ఆఫీసు కు డుమ్మా కొట్టడం కోసం అబద్దం ఆడాడు.

దీనితో ఆటను పనిచేస్తున్న కార్యాలయాన్ని కూడా బంద్ చేయాల్సివచ్చింది.ఈ ఘటన కూడా కరోనా విజృంభించిన చైనా లోనే చోటుచేసుకుంది.

చైనా లోని జియంగ్సు లో ఝా అనే వ్యక్తి తనకు కరోనా వైరస్ సోకింది అంటూ అబద్దం చెప్పాడు.దీనితో అది ఇంకెవరికి సోకకూడదు అన్న ఉద్దేశ్యం తో మూడు రోజుల పాటు మూతపెట్టాల్సి వచ్చింది.

అంతేకాకుండా అదే కార్యాలయం అతడితో పాటు పనిచేస్తున్న మిగిలిన 47 మంది ఉద్యోగులు ఇళ్లలో ఐసోలేషన్‌లో ఉండాల్సి వచ్చింది.ఝా తన కార్యాలయ అధికారులకు తాను ఒక సూపర్ మార్కెట్‌కు వెళ్లినపుడు కరోనా బాధితుడు అక్కడ ఉన్నాడని తెలిపాడు.

Advertisement

దీనిని రుజువు చేసుకునేందుకు ఒక రసీదు కూడా చూపించాడు.అయితే రసీదు తప్పుడుదని అతని ఆఫీసు అధికారులకు తెలియడం తో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనితో పోలీసులు దర్యాప్తు జరపగా అతడు అన్ని అబద్దాలు చెప్పినట్లు గుర్తించారు.మరోవైపు వైద్యులు కూడా అతనికి ఎటువంటి కరోనా వైరస్ లేదని తేల్చి చెప్పడం తో ఇక అబద్దం చెప్పిన ఝా ను అదుపులోకి తీసుకున్నారు.

దీంతో కరోనా వైరస్ వ్యాధిపై అబద్ధం చెప్పాడనే కారణంతో ఝాకు మూడు నెలల పాటు కోర్టు జైలు శిక్ష విధించినట్లు తెలుస్తుంది.

పుట్టినరోజున అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సింగర్ సునీత.. ఏం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు