టీవీ సౌండ్ ఎక్కువ పెట్టాడని ఏం చేశాడో తెలుసా?

ఈ రోజుల్లో మనుష్యులు ఎందుకు కోపడుతున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు.

ఒక్కోసారి వారి కోపం ఎదుటివారి ప్రాణాలమీదకు తీసుకొస్తుందనే విషయాన్ని కూడా వారు మరిచిపోతుండటంతో అనేక ఘోరాలు జరుగుతున్నాయి.

తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.తన భార్యతో గొడవ పడుతున్న ఓ భర్త కోపంతో ఊగిపోయాడు.

ఆర్మూర్‌లోని గోల్ బంగ్లాలో నివాసముంటున్న సాత్‌పుతే గిర్మాజీ రాజేందర్‌(40) బుధవారం రాత్రి టీవీ చూస్తున్నాడు.తన ఇంట్లో అద్దెకు ఉంటున్న బాలనర్సయ్య తన భార్యతో గొడవపడుతున్నాడు.

ఈ క్రమంలో టీవీ సౌండ్ ఎక్కువ పెట్టాడనే కోపంతో రాజేందర్ తలపై బాలనర్సయ్య బలంగా కొట్టాడు.దీంతో రాజేందర్ అక్కడే పడిపోయాడు.

Advertisement

కాగా అతడిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.కోపంతో విచక్షణా రహితంగా ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన బాలనర్సయ్యను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

కాగా మృతుడు రాజేందర్‌కు భార్య, ఒక కొడుకు ఉన్నారు.కోపం కారణంగా ఓ మనిషి ప్రాణం పోవడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు