ఎత్తైన మంచు పర్వతం నుంచి దూకి ఫీట్లు.. చూసే వారికే గుండె జారిపోతుంది!

ప్రస్తుతం చలి కాలం( Winter ) వచ్చేసింది.పొద్దున్నే లేచి స్నానం చేయాలంటే చాలా మంది బద్దకిస్తుంటారు.

 Man Jumps In Ice Cold Water Video Viral Details, Viral Latest, News Viral, Socia-TeluguStop.com

అసలు మంచం మీద నుంచి లేచేందుకు కూడా ఇష్టపడరు.బయట ఉన్న చలి వల్ల వెచ్చని దుప్పట్లు కప్పుకుని నిద్రపోతుంటారు.

ఇలాంటి చలిలో వేడి నీటి స్నానం అంతా చేస్తుంటారు.అయినప్పటికీ చలికి గజగజా వణుకుతుంటారు.

ప్రస్తుత చలికాలంలో ఎవరైనా మంచు కొండల్లో( Snow Mountains ) పర్యటించాలని అనుకుంటారా? ఎవరూ ఇలా చేయాలని అనుకోరు.అందులోనూ మంచు కొండల మధ్యలో ఎముకలు కొరికే చలిలో చల్లని నీటిలో దూకడానికి అస్సలు ప్రయత్నించారు.

అయితే ఓ వ్యక్తి చేసిన ఫీట్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.ఎంతో ఎత్తు నుంచి అమాంతం కిందికి దూకడంతో పాటు మంచు కొండల్లో చేసిన విన్యాసాలు గగుర్పాటుకు లోనయ్యేలా చేస్తున్నాయి.

ఈ ఆసక్తికర వీడియో గురించిన విషయాలు తెలుసుకుందాం.

బాడీ బిల్డర్లు చాలా కఠోర సాధన చేస్తుంటారు.నిత్యం చెమటలు కక్కేలా జిమ్‌లలో ఎక్సర్‌సైజులు చేస్తారు.ఇలా చక్కటి శరీరాకృతిని సంపాదించుకుంటారు.

అయితే ఓ బాడీబిల్డర్( Body Builder ) మాత్రం వినూత్నంగా ప్రయత్నించాడు.ఈ శీతాకాలంలో మంచు కొండల్లో పర్యటించాడు.

అంతటితో ఆగకుండా చూసే వారికి గుండె జారిపోయే ఫీట్లు ప్రదర్శించాడు.మంచు కొండల్లో ఎత్తైన ప్రదేశం నుంచి కింద ఉన్న నీటి గుంటలో అమాంతంగా దూకేశాడు.

ఆ సమయంలో ఆ వ్యక్తి కేవలం లో దుస్తులు మాత్రమే ధరించి ఉన్నాడు.ఇలాంటి ఫీట్లు చూడగానే ఎవరికైనా ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అవుతుంది.

చలి కాలంలో చల్లటి నీటిని పట్టుకోవడానికే చాలా మంది ఇష్టపడరు.

అలాంటిది మంచు కొండల్లో చల్లని నీటిలోకి( Cold Water ) ఎత్తైన ప్రాంతం నుంచి దూకడం చాలా సాహసమనే చెప్పాలి.ముఖ్యంగా చల్లని నీటిలో స్నానం చేయడం ఒక ఎత్తైతే, కొండ పై నుంచి దూకడం మరో ఆసక్తికర పరిణామం.మంచుపై కాలు వేస్తేనే జారిపోతుంది.

మనం ఖచ్చితంగా పడిపోతాం.అలాంటిది మంచు కొండల్లో అతడు ఎలాంటి భయం లేకుండా రిస్క్‌తో కూడిన ఫీట్లు చేశాడు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ (ట్విటర్)‌లో వైరల్ అవుతోంది.అతడి సాహసాన్ని మెచ్చుకుంటూనే, ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయొద్దని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube