యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) మోత్కూరు మండలం అనాజిపురంలో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు.గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతూ కన్పించాడు.
దీంతో గ్రామస్తులు ఆ వ్యక్తిని ప్రశ్నించే ప్రయత్నం చేయగా పరుగులు పెట్టాడు.ఈ క్రమంలో పిల్లలను ఎత్తుకేళ్లేందుకు వచ్చాడని భావించిన గ్రామస్తులు అతన్ని వెంబడించారు.
ఇంతలో సదరు వ్యక్తి గ్రామంలో ఉన్న గెస్ట్ హౌస్ గోడ దూకి లోపలికి వెళ్లాడు.అనంతరం స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం ఆ వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.







