ఆఫీసులో కునుకు తీసిన ఉద్యోగి.. రెండు రోజులు నిద్రపోయావంటూ సహోద్యోగులు ప్రాంక్!

సాధారణంగా ఉద్యోగులు( Employees ) ఆఫీసులో ఏదో ఒక సందర్భంలో కాసేపు కునుకు తీస్తుంటారు.ఇలా ఒక కునుకు తీసి మళ్ళీ లేచి యథావిధిగా తమ పనిని చేసుకుంటుంటారు.

 Man Falls Asleep At Work And Colleagues Make Him Believe That It Has Been 2 Days-TeluguStop.com

అయితే నిద్ర పోయేముందు ఆఫీసులో స్టాఫ్ అంతా ఉండి, లేచిన తర్వాత ఎవరూ కనిపించకపోతే షాక్ కావడం ఖాయం.ఆఫీసులో అందరూ వెళ్లిపోయేంతవరకు పడుకున్నామా, ఏంటి? అనే డౌట్ కూడా వచ్చి కంగారు పడటం సహజం.కాగా తాజాగా ఒక ఉద్యోగికి ఇలాంటి షాకే ఇచ్చి అతనికి కొన్ని నిమిషాల వరకు ముచ్చెమటలు పట్టించారు సహోద్యోగులు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.

వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో( Funny Video )లో ఒక ఉద్యోగి హెడ్‌ఫోన్స్‌ ధరించి ఆఫీస్‌లో డెస్క్ ముందు కూర్చుని ఉండటం చూడవచ్చు.తర్వాత అతను నిద్రలోకి జారుకున్నాడు.

అతని సహోద్యోగుల్లో ఒకరు అతను నిద్రపోతున్నట్లు తెలుసుకున్నారు.ఆపై సదరు కొలీగ్ ఆఫీస్‌లోని ఇతర ఉద్యోగులందరికీ దాని గురించి తెలియజేస్తాడు.

గది మూలలో ఉన్న డెస్క్‌ల కింద దాక్కోవాలని అందరికీ సూచించాడు.అంతే, వారు కూడా ప్రాంక్ చేయాలనే ఉత్సాహంతో దాక్కోవడానికి పరుగెత్తారు.

నిద్రపోతున్న ఉద్యోగి మేల్కొనే వరకు అక్కడే నక్కి ఉన్నారు.

కొన్ని నిమిషాల తర్వాత నిద్ర లేచిన ఉద్యోగి ఆఫీస్ మొత్తం ఖాళీగా ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు.ఆఫీస్ లో ఉండాల్సిన ఉద్యోగులందరూ ఎటు వెళ్లిపోయారో తెలియక అయోమయంలో పడిపోయాడు.తర్వాత ఉద్యోగులు ఎక్కడికి పోయారో తెలుసుకునేందుకు తన సహోద్యోగి( Colleague )కి కాల్ చేశాడు.

ఆ సహోద్యోగి బదులిస్తూ ఆదివారం కావడంతో సినిమా చూడటానికి థియేటర్‌లో ఉన్నానని చెప్పాడు.ఆదివారమని చెప్పేసరికి అతడు ఒక్కసారిగా అవాక్కయ్యాడు.తర్వాత ఏమీ అర్థం కాక తల గీక్కున్నాడు.ఆపై తేరుకొని ” అంటే నేను శుక్రవారం నుంచి నిద్రపోతున్నానా?” అని ఒక షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ పెట్టాడు.

ఆ వ్యక్తి కాసేపటికి గది నుండి బయటికి వెళ్తాడు.ఇంతలోనే అతని సహోద్యోగులందరూ ఏమీ జరగనట్లుగా ఉరుకుల పరుగులు తీస్తూ తమ సీట్లలోకి వెళ్లి కూర్చున్నారు.ఆ వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు, అతని సహోద్యోగులందరినీ తిరిగి వారి డెస్క్‌ల వద్ద చూసి అతను మళ్లీ గందరగోళానికి గురవుతాడు.దాంతో వీడియో ముగిస్తుంది.ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే 80 వేలకు పైగా వ్యూస్ సంపాదించింది.దీన్ని చూసిన నిరసనలు బాగా నవ్వుకుంటున్నారు.“పనిలో నిద్రపోకు!!” అని ఈ ఫన్నీ వైరల్ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు.ఈ ఫన్నీ ప్రాంక్ వీడియో( Funny Prank Video )ని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube