Metro Train Towel: టవల్ కట్టుకొని మెట్రో ట్రైన్ ఎక్కిన యువకుడు.. స్టన్ అయిన పాసెంజర్స్.. తర్వాత ఏమైందంటే..

సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని చాలామంది పిచ్చి పట్టినట్లు వింత పనులు చేస్తున్నారు.తాజాగా ఒక వ్యక్తి ఏకంగా టవల్ కట్టుకొని మెట్రో ట్రైన్ ఎక్కాడు.

 Man Enters Metro Train With Just Towel Video Viral Details, Viral Video, Viral N-TeluguStop.com

సాధారణంగా బయటికి వెళ్లేటప్పుడు ఎవరైనా సరే మంచిగా టిప్ టాప్ గా డ్రెస్ చేసుకుంటారు.అలాంటిది ఈ వ్యక్తి జస్ట్ ఒక తువ్వాల కట్టుకొని వందల మంది ఉండే మెట్రో ట్రైన్ ఎక్కాడు.

టవల్ కట్టుకొని బజారులోకి వెళ్లాలంటేనే సిగ్గుగా అనిపిస్తుంది.అలాంటిది ఇతడు సిగ్గు అంతా వదిలేసి సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి టవల్ కట్టుకొని అందరిలో నవ్వుల పాలయ్యాడు.

దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న వీడియో ఓపెన్ చేస్తే మనకు రద్దీగా ఉన్న ఒక మెట్రో ట్రైన్ బోగీ కనిపిస్తుంది.

అందులోకి ఒక యువకుడు బనియన్, టవల్ ధరించి ఎక్కాడు.ఆపై బోగీలో అటూ ఇటూ తిరుగుతూ అద్దంలో తన అవతారాన్ని చూసుకుంటూ హీరోలాగా ఫోజులు ఇచ్చాడు.ఇది చూసిన అమ్మాయిలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు.ఇదేం అవతారం రోయ్ అనుకుంటూ మగవారు కూడా అతన్ని చూసి హేళన చేశారు.

అయినా అతడు మాత్రం సిగ్గు లేకుండా అలానే తిరిగేసాడు.

”మా ట్యాంక్‌లో నీళ్లు చుక్క కూడా లేకుండా అయిపోయాయి.అందుకే ఇవాళ ఆఫీసులోనే స్నానం చేస్తా” అనే ఫన్నీ క్యాప్షన్ తో ఈ వీడియోని షేర్ చేశారు.దీన్ని చూసిన నెటిజన్లు పొరపాటున టవల్ జారిపోతే పరిస్థితి ఏంటి అని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

అమ్మో ఇలా చేయడానికి చాలా ధైర్యం కావాలి అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో పై మీరు కూడా లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube