ఓ యువకుడు ఇద్దరు యువతులను ప్రేమ పేరుతో మోసం చేసి మూడవ యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డాడు.అయితే పోలీసులు సడన్ గా ఎంట్రీ ఇచ్చి నిశ్చితార్ధాన్ని ఆపుచేసి అరెస్టు చేశారు.
అయితే అసలు ట్విస్ట్ ఏమిటంటే.మోసం చేసిన యువకుడి కోసం మోసపోయిన అమ్మాయిలు పోలీస్ స్టేషన్ లో గొడవ పడడం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు.
ఈ విచిత్రమైన సంఘటన హైదరాబాద్ నగరంలో( Hyderabad ) చోటుచేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే.ఆంధ్రప్రదేశ్ లోని రాయచోటికి చెందిన బాబా ఫక్రుద్దీన్( Baba Fakruddin ) అనే యువకుడు హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉండే ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు.
ఇతనికి ఆ ఆసుపత్రిలో ( Hospital ) పనిచేసే ఓ యువతి రెండేళ్ల క్రితం పరిచయమైంది.వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది.బాబా ఫక్రుద్దీన్ ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెంగళరావు నగర్ డివిజన్ లోని ఓ బస్తీలో నివాసం ఉంటున్న ఆ యువతి రూముకు అనేకమార్లు వెళ్లి తన కోర్కెను తీర్చుకున్నాడు.కొంతకాలం తర్వాత ప్రేమించిన యువతికి చెప్పకుండా ఖార్ఖానాలో ఉండే మరో ఆసుపత్రిలో పనిలో చేరాడు.

అక్కడ పనిచేసే యువతి తో కూడా ప్రేమాయణం నడిపి ఆమెతో కూడా శారీరక సంబంధం కొనసాగించాడు.ఇలా ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమ పేరుతో దారుణంగా మోసం చేశాడు.ఈ నెల ఆరవ తేదీ వీరికి చెప్పకుండా తన స్వగ్రామం వెళ్లి, ఇంటి పక్కనే ఉన్న యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు.ఈనెల 24వ తేదీ నిశ్చితార్థం ( Engagement ) జరగాల్సి ఉండగా.
మధురానగర్ ఎస్సై ఇక్బాల్( SI Iqbal ) సడన్ గా ఎంట్రీ ఇచ్చి అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకువచ్చారు.పోలీస్ స్టేషన్ లో జరిగిన అసలు ట్విస్ట్ చూసి పోలీసులు షాక్ తో ఆశ్చర్యపోయారు.

బుధవారం రాత్రి బాబా ఫక్రుద్దీన్ చేతిలో మోసపోయిన ఇద్దరు యువతులు పోలీస్ స్టేషన్ కు వచ్చి వీడు నా వాడు అంటే కాదు నా వాడు అంటూ ఇద్దరూ యువతులు గొడవపడ్డారు.పోలీసులకు ఏం చేయాలో తెలియక కాసేపు అయోమయంలో పడ్డారు.ముందుగా నేను మోసపోయాను అంటే కాదు ముందు నేను సర్వస్వం అర్పించాను నేను పెళ్లి చేసుకుంటాను అంటూ యువతులు పోలీస్ స్టేషన్ లో నానా రచ్చ చేశారు.మధురానగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సై ఇక్బాల్ నిందితుడైన బాబా ఫక్రుద్దీన్ ను రిమాండ్ కు తరలించారు.







