మమతకు లైన్ క్లియర్.. భవానీపూర్ ఉప ఎన్నికల్లో పోటీ

పశ్చిమ బెంగాల్ లో మూడు.ఒడిస్సా లో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికల షెడ్యూల్ ను  కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది.

ఈ నాలుగు నియోజకవర్గాలకు సెప్టెంబర్ 30 న పోలింగ్ ఉంటుంది.ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేయాలని భావిస్తున్న భవానీపూర్ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరుగుతుంది.

అక్టోబర్ మూడో తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని ఈసీ వెల్లడించింది.సెప్టెంబర్ 30న బెంగాల్ లోని భవానీపూర్, జంగీపుర్, శంషేర్ గంజ్ స్థానాలకు, అదేరోజున ఒడిశాలోని పిప్లి అసెంబ్లీ ఎన్నికలు జరిగినట్లు సీఈసీ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఈ ఉప ఎన్నిక ద్వారా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టడానికి మమతాకు మంచి అవకాశం లభించింది.ఈ యేడాది ఆరంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమత తన సొంత నియోజకవర్గం భవానీపుర్ వద్దఅనుకుని నందిగ్రామ్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.

Advertisement

ప్రజాప్రయోజనాలు పాలనా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా భవానీపూర్ ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించాలని బెంగాలీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి చేశారని ఎన్నికల సంఘం తెలిపింది.దేశవ్యాప్తంగా 31 అసెంబ్లీ నియోజకవర్గాలు మూడు పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు తర్వాత నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది.

పశ్చిమ బెంగాల్ ప్రత్యేక అభ్యర్ధన మేరకు అక్కడ ఎన్నికలు ముందుకు వచ్చామని స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు