మమ్ముట్టి మరియు అతని కొడుకు దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) పేరుకే వీరిద్దరూ మలయాళం యాక్టర్స్.కానీ వారి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎప్పుడో ఫిదా చేసేశారు.
ఇటీవల కాలంలో మహానటి, సీతారామం వంటి సినిమాలతో దుల్కర్ సల్మాన్ తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్( Fan Following ) దక్కించుకున్నారు.ఇక గతంలో స్వాతి కిరణం సినిమాతో మమ్ముట్టి సైతం అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడం మాత్రమే కాదు ఇటీవల యాత్ర సినిమా కూడా అందరికీ గుర్తుండిపోయింది.
అయితే లాంగ్వేజ్ బారియర్స్ పెట్టుకోకుండా సినిమాలు తీయాలని ప్రతి ఏటా అనేక సినిమాల్లో నటిస్తూ వచ్చారు మమ్ముట్టి.ఒక్కోసారి ఏడాదికి ఎన్ని చేసారో లెక్కపెట్టడానికి కూడా కష్టం అయ్యేంత నెంబర్ ఒక సంవత్సరంలో ఉండేది.
ఉదాహరణకు 1982లో ఏకంగా 24 చిత్రాల్లో ఆయన నటించారు అంటే ఆ టైంలో ఎంత హార్డ్ వర్క్ పెట్టి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు.ఇప్పుడు ఉన్న హీరోలు రెండు మూడు ఏళ్లకు ఒక సినిమా తీయాల్సి వచ్చినా కూడా చాలా కష్టపడి పోతున్నారు.పైగా క్వాలిటీ అనే పేరు చెప్పుకొని ఏళ్లకు ఏళ్ళు టైం తీసుకుని అందుకు తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ కూడా పెంచుకుంటూ పోతున్నారు.ఒక సినిమా లాక్ అయింది అంటే మూడు నాలుగు ఏళ్ళు తీసుకోవాలి కాబట్టి అన్నీ సంవత్సరాలకు సరిపడా పేమెంట్ ఒకేసారి పుచ్చుకుంటున్నారు.
కానీ ఈ వ్యవస్థకు మమ్ముట్టి పూర్తి వ్యతిరేకి.
ఆయన అనేక సినిమాల్లో నటించడం మాత్రమే కాదు ప్రతి ఏడు తన కొడుకు దుల్కర్ సల్మాన్ ని కూడా రెండు సినిమాల్లో నటించాలని మమ్ముట్టి( Mammootty ) చెప్పారట.అలా ఏటా రెండు సినిమాలు తీయకపోతే తమని నమ్ముకున్న ఎంతోమంది నటీనటులకు టెక్నీషియన్స్ కి పని దొరకదని మమ్ముట్టి దుల్కర్ సల్మాన్ కి రూల్ పెట్టారట.ఒకానొక సమయంలో చాలా టైం సినిమాని ఒప్పుకోవడానికి దుల్కర్ తీసుకుంటున్నట్టు ఆయన గమనించారట అదే సమయంలో పిలిచి మరి ఈ విషయాన్ని చెప్పారట.
అప్పటి నుంచి రకరకాల భాషల్లో దుల్కర్ సల్మాన్ కూడా బిజీ అయిపోతూ వచ్చారు.ఏటా రెండు సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నారట.ఆలా తండ్రి ఆజ్ఞను తూచా తప్పకుండా పాటిస్తున్నాడు దుల్కర్.