Mammootty : మనిషి వికృత రూపానికి నిలువుటద్దం.. మరోసారి ఇరగదీసిన మమ్ముట్టి

ఇప్పటికే మమ్ముట్టి( Mammootty ) గురించి అతను నటన గురించి అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం.

మలయాళ మెగాస్టార్ గా చాలా ఏళ్లుగా ఎన్నో వందల సినిమాల్లో నటించిన మమ్ముట్టి గత పది ఏళ్ల కాలంలో చూసుకుంటే ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాల్లోనే నటిస్తూ వస్తున్నాడు.

ఒక మెగాస్టార్ 70 ఏళ్ల వయసులో గే పాత్రలో నటిస్తాడని ఎవరైనా కలగన్నామా.? కానీ కాదల్ ది కోర్ చిత్రంలో అది జరిగింది.అలాంటి సినిమాలే మళ్లీ మళ్లీ తీయడానికి మమ్ముట్టి ఎందుకు సాహసం చేస్తున్నాడు అంటే అది పెద్ద చిక్కు ప్రశ్న.

ఆ ప్రశ్నకు సమాధానం అయితే దొరకదు కానీ మమ్ముట్టి మరోసారి ప్రేక్షకులపై తన అస్త్రాన్ని వదిలాడు అదే భ్రమయుగం( Bramayugam ).మనిషి వికృత రూపానికి నిలువుటద్దం లాంటి ఈ చిత్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

మమ్ముట్టి నటన ఈ సినిమాలో ఒక మహా అద్భుతం.అతనితో పాటు సినిమాలో నటించిన మిగతా వారి నటన కూడా ఎంతో చక్కగా ఉంది.ఇప్పటికే చాలాసార్లు మన టాలీవుడ్ హీరోలను మలయాళ హీరోలతో( Malayalam ) పోల్చి చూపిస్తూనే ఉన్నాం.

Advertisement

అయినా కూడా అందరూ మరోసారి ఈ సినిమాను చూడాలి.తెలుగు హీరోలు ప్రత్యేకంగా ఈ సినిమా చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.

ఇలాంటి ప్రయోగాలను తెలుగు తెరపై ఆవిష్కరించాల్సిన డిమాండ్ ఉంది.ఏ భాషలో ఎవరు గొప్ప సినిమాలో తీస్తే మాకేంటి అని పట్టించుకోకుండా మొద్దు నిద్రపోతున్న వారు ఒక్కసారి నిద్రలేచి ఈ సినిమాను చూడాలి.

ఒక బలమైన కమ్యూనికేషన్ వ్యవస్థ.ప్రేక్షకుల మెదడులను ప్రభావితం చేసే ఒక సిస్టం అలాంటి దాన్ని ఇప్పటికే బ్రష్టు పట్టించేశారు.

బ్రమయుగం సినిమా( Bramayugam MOVIE ) కూడా ఆ కోవలోకే వస్తుంది.ఒక్కసారి ఆ సినిమాలోకి వెళ్లిన వారు మళ్ళీ బయటకు రావడం కష్టం.అంతలా ప్రభావితం చేస్తుంది.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?

మేకింగ్ స్టాండర్డ్స్ కుడ్ చాలా బాగున్నాయి.నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది.

Advertisement

ఇలాంటి సినిమాలు తెలుగు లో తీస్తే అందరికీ నచ్చక పోవచ్చు.వసూళ్లు ఎలా ఉన్నా మమ్ముట్టి మాత్రం డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడు.

పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ లో వచ్చిన ఈ సినిమా ఇండియన్ హిస్టరీ లోనే ఒక గొప్ప సాహసం.మిగతా భాషలతో పోలిస్తే తెలుగు లో చాలా లేట్ గా విడుదల అయ్యింది.

తాజా వార్తలు