నామినేషన్ దాఖలు చేసిన మమత

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి టిఎంసి తరపున అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.బెంగాల్ లోని పలు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు కమిషన్ ఉప ఎన్నికలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

 Mamata Filed The Nomination, Maamtha Banarjee ,  Bengal Cm , Election Commission-TeluguStop.com

ఈ ఏడాది వేసవిలో జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే.అయితే పార్టీకి మెజార్టీ రావడంతో  ఆమె సీఎం పదవి చేపట్టారు.

ఆరు నెలల తర్వాత కూడా సీఎంగా కొనసాగాలంటే ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందాల్సి ఉంటుంది.ఈ నేపథ్యంలో జరుగనున్న ఉప ఎన్నికల్లో ఆమె గెలిపిస్తేనే సీఎంగా కొనసాగుతారు.

నామినేషన్ వేసే సమయంలో ఆమెతోపాటు రాష్ట్ర క్యాబినెట్ మంత్రి భార్య ఫిర్హాద్ హకిమ్ తో కలిసి వెళ్లారు.అనంతరం పిర్హాద్ మాట్లాడుతూ.

నందిగ్రామ్ లో మమత పై కుట్ర పన్ని ఓడించారని ఇప్పుడు భవానీపూర్ ప్రజలు మమతను రికార్డు మెజారిటీతో గెలిపించి చరిత్రను తిరగరాస్తారని వ్యాఖ్యానించారు.భవానీపూర్ నుంచి 2011, 2016 ఎన్నికల్లో మమత పోటీ చేసి విజయం సాధించారు.

బీజేపీ తరఫున ప్రియాంక తిబ్రేవాల్భవానీపూర్ లో మమత కు పోటీగా బీజేపీ నేత ప్రియాంక తిబ్రేవాల్ పోటీ చేయనున్నారు.ఈ మేరకు బీజేపీ ఆమె పేరును నామినేట్ చేసింది.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింస పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తే ఈ ప్రియాంక తిబ్రేవాల్ వృత్తి రీత్యా ఆమె న్యాయవాది.ఆమెతో పాటు సంసేర్గంజ్ కు మిలాన్ ఘోష్, జంగీపూర్ కు సుజిత్ దాసులను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube