సరికొత్త రికార్డ్ సృష్టించిన మమతా బెనర్జీ..!

భవానీపూర్‌లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సరికొత్త రికార్డ్ సృష్టించారు.58 వేల 832 ఓట్లతో బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ పై ఘన విజయం సాధించారు.

ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో మమతా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు.

తొలి రౌండ్ నుంచీ ఆధిక్యం ప్రదర్శించిన మమతా చివరి రౌండ్ ముగిసేసరికి 58 వేల 832 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ ను ఓడించి హ్యాట్రిక్ సాధించారు.అయితే ప్రియాంక టిబ్రే వాల్ సీఎం మమతాకు కనీస పోటీ ఇవ్వలేకపోయారు.

మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్ నుంచి గత రెండు ఎన్నికల్లోనూ గెలుపొందారు.కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు.

అయితే ఆమె సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు.అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైంది.

Advertisement

టీఎంసీ 213 సీట్లు గెలుచుకుంది.దీంతో మమతా బెనర్జీ మూడోసారి సీఎం అయ్యారు.

అయితే అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్ లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమతా ఓడిపోయారు.దీంతో బీజేపీ తొండి ఆడిందంటూ విమర్శలు గుప్పించారు.

అయినా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మమతా.సీఎంగా కొనసాగాలంటే ఎమ్మెల్యేగా గెలవక తప్పదు.

ఈ పరిస్థితుల్లో భవానీపూర్ నుంచి ఉప ఎన్నికల బరిలో నిలిచారు .అయితే ఉప ఎన్నికల్లో తొలి రౌండ్ నుంచే ఆధిక్యంలో కొనసాగారు మమతా.భవానీపూర్ తో పాటు జంగీపూర్, సంషేర్ గంజ్ స్థానాల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగించారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

భవానీపూర్ లో బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ పై 58,322 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించడంతో కలిఘాట్ లోని మమతా బెనర్జీ కార్యాలయంతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేడుకలు ప్రారంభమయ్యాయి.కరోనాను దృష్టిలో పెట్టుకొని విజయోత్సవాలను చేపట్టవద్దని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది .దీంతో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంది.భవానీపూర్ తో పాటు తృణమూల్, కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు.

Advertisement

అయితే ఉప ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ దూకుడుతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.కోల్కతాలోని మమతా ఇంటి వద్దకు భారీగా చేరుకున్న పార్టీ కార్యకర్తలు డాన్స్ చేస్తూ నినాదాలతో హంగామా చేస్తూ మమతా నినాదాలతో హంగామా చేశారు.

దీని తర్వాత మమతా బెనర్జీ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి విజయోత్సవ యాత్ర చేయవద్దని ఆదేశించారు.

తాజా వార్తలు