డ్రామాలు కేసీఆర్‌కు అల‌వాటే అంట..!

ప్రశాంతంగా ఉండాల్సిన తెలంగాణాలో మ‌రో మారు ఉద్య‌మాల మాట వినిపించ‌డానికి ప్ర‌ధాన కార‌కుడు ఈ రాష్ట్ర ముఖ్య‌మం్ర‌తి కేసీఆర్ అని కాంగ్రెస్ నేత మల్లు రవి విమర్శించారు.

శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మిగులు బ‌డ్జెట్‌తో ఇచ్చిన రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోనికి తీసుకుపోయిన ఘ‌న‌త కేసీఆర్‌కే ద‌క్కుతుంద‌ని ఎద్దేవా చేసారు.

పాల‌నా ప‌ర‌మైన లోటు పాట్లు స‌వ‌రించుకుని నిర్మాణాత్మ‌క స‌ల‌హాలు స‌హృద‌యంతో స్వీక‌రించాల్సిన ముఖ్య‌మం్ర‌తి నేటికీ ప్రాంతీయ వాద‌న‌లు రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం శోచ‌నీయ‌మ‌ని అన్నారు.స‌మ‌స్య క‌నిపించిన‌ప్పుడ‌ల్లా కొత్త డ్రామాకు తెర‌లేప‌డం ముఖ్య‌మంత్రి నైజ‌మ‌ని, కొంత కాలం ఇత‌ర పార్టీల వారిని చేర్చుకునే వ్య‌వ‌హారం, ఆపై హై కోర్టు వివాదం ఇప్పుడు కొత్త జిల్లాల డ్రామాకు తెరలేపారని గుప్పించారు తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కాం్ర‌గెస్ పార్టీ ఏనాడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

అయితే కేవ‌లం .టీఆర్‌ఎస్‌ రాజకీయ లబ్ది కోసమే జిల్లాల విభజన చేస్తోందంద‌ని, ఇందుకు ప్ర‌జా భాగాస్వామ్యం అవ‌స‌రం లేన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని విమ‌ర్శించారు.ప్రజలకు ఇచ్చిన హామీలు మరచిపోయేందుకే కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటులో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఉద్యమాలు పెరుగుతాయని ప్రభుత్వానికి సూచించారు మల్లు రవి.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు
Advertisement

తాజా వార్తలు