కేం్రద సెన్సార్ బోర్డులో మరో తెలుగు వ్యక్తికా స్ధానం కలిపిస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
గత రెండు దశాబ్దాలుగా టీవీ, సినీ రంగంలో వివిధ శాఖలలో పనిచేస్తున్న దిలీప్ రాజాకును బోర్డు సభ్యుడిగా నియమిస్తూ.ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దోనెపూడి దిలీప్ రాజా 300లకు పైగా టెలి ఫిల్మ్స్ ఎపిసోడ్స్ కు దర్శకత్వం వహించి, చిత్రసీమలోని అన్ని విభాగాలపై పూర్తి పట్టున్న వ్యక్తిగా పేరొందారు.దిలీప్ రాజాను సెన్సార్ బోర్డు సభ్యుడిగా నియమించడం పట్ల చిన్న సినిమా నిర్మాతల మండలి హర్షం వ్యక్తం చేసింది.
దిలీప్ రాజా రెండేళ్ల పాటు బోర్డు సభ్యునిగా కొనసాగుతారు కాగా ఇప్పటికే బోర్డులో ప్రముఖ నటుడు రాజశేఖర్ సతీమణి జీవిత సభ్యురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.







