కెట్ గేమ్ టీవీలలో వస్తోందంటే చాలు, యువత అతుక్కుపోయి మరీ చూస్తూ ఉండిపోతుంటారు.ఇక్కడ సినిమా హీరోలకు ఏ స్థాయిలో అభిమానులు వుంటారో క్రికెట్ క్రీడా కారులకు కూడా అదే స్థాయిలో అభిమానులు వుంటారనే విషయం తెలిసినదే.
కొంతమంది క్రికెటర్ల బేటింగ్, బౌలింగ్ స్టైల్ ని ఇష్టపడే అభిమానులు కూడా ఇక్కడ వున్నారు.క్రికెట్ ఆటలో ఒక్కొక్క బౌలర్ కి ఒక్కో శైలి ఉంటుంది.
లాంగ్ రన్ తీసుకుని బౌలింగ్ చేసే ఫాస్ట్ బౌలర్లు అయినా.తక్కువ రనప్‌తో వేసే స్పిన్నర్లు అయినా ఎవరికి వాళ్లదే ప్రత్యేకమైన శైలి.
నిన్నటి మలింగ నుంచి నేటి బుమ్రా, మతీషా పతిరాణా (శ్రీలంక) వరకు ఈ విషయంలో ఎవరి శైలి వారిదే అని చెప్పుకోవాలి.అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే బౌలర్ బౌలింగ్ శైలి మాత్రం వీరందరికి కూడా కాస్త భిన్నమైన శైలి అని చెప్పుకోవాలి.అవును… తాజాగా ఓ బౌలర్.మలింగ, బుమ్రా, పతిరాణాల్నే కాదు.
అందర్నీ ఆశ్చర్యపరుస్తూ బౌలింగ్ చేశాడు.బాల్ వేయడానికి నిల్చున్న చోటు నుంచి బంతి విసిరే వరకు కూడా బాల్‌ను పట్టుకున్న చేతిని గిరగిరా తింపుతూనే ఉన్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.నెట్టింట్లో వైరల్ అయిన వీడియో లో బౌలింగ్ చేసిన బౌలర్, ఇతరత్రా వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు.
ఇకపోతే అతగాడి బౌలింగ్ శైలి చూస్తే మాత్రం లగాన్ సినిమా గుర్తుకు వస్తోంది.ఆ సినిమాలో గోలీ అనే పాత్రలో నటించిన దయా శంకర్ పాండే బౌలింగ్ లాగ అనిపిస్తుంది.
అప్పుడు అదేదో సినిమాలో ట్రై చేసిన బౌలింగ్ నిజజీవితంలో కూడా ట్రై చేస్తున్నారు అంటే ఆశ్చర్యకరమే అని చెప్పుకోవాలి.ప్రస్తుతం ఈ వీడియో ట్విటర్‌లో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.మోయినక్ దాస్ అనే ఓ ట్విటర్ యూజర్ స్పందిస్తూ.
‘బుమ్రా, పతిరణా, మలింగలను పక్కనబెట్టండి.ఇదిగో, బౌలింగ్ యాక్షన్‌లో మనకో గొప్ప బౌలర్ దొరికాడు.
’ అని రాసుకొచ్చాడు.ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ సారథి మైఖేల్ వాన్ కూడా ఈ వీడియోకు స్పందిస్తూ.
‘ప్రాపర్ యాక్షన్’ అని ట్వీట్ చేశాడు.