మలేషియా ఆంధ్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి.మలేషియా కౌలాలంపూర్ లోని డీ చక్ర రూఫ్ టాప్ హాల్, ఖీఔఓ కాంప్లెక్స్, బ్రిక్ ఫీల్డ్స్, కులాలంపూర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంప్రదాయ దుస్తులతో తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఇండియన్ హై కమిషనర్ ఆఫ్ మలేషియా హెచ్ఈబిఎన్ రెడ్డి, మలేషియా తెలుగు అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సీతారావు, మలేషియా తెలంగాణ అసోసియేషన్ డిప్యూటీ ప్రెసిడెంట్ సత్య, వైస్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి, మలేషియా తెలుగు ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ ఇతర తెలుగు సంఘాల ప్రముఖులు ఈ వేడుకలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ఉత్సవాలలో కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల పాటలు, నృత్యాలతో ఆడిటోరియం కలకలలాడిపోయింది.అంతేకాకుండా జబర్దస్త్ ఫేమ్ అశోక్, బాబీ పాల్గొని వారి హాస్యంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.రుచికరమైన తెలుగు వంటకాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.
అంతేకాకుండా ముగ్గుల పోటీలు, లక్కీ కపుల్, క్యూట్ బేబీ కాంటెస్ట్, లక్కీ డ్రా నిర్వహించి బంగారు బహుమతులను కూడా అందజేశారు.విదేశీ గడ్డపై ఇలాంటి పండుగ నిర్వహిస్తూ తమ సంస్కృతి సంస్కారాలను కాపాడుతూ నవ తరానికి చాటిచెబుతున్నా మా అసోసియేషన్ను ఆయన ఎంతో అభినందించారు.
ఈ సంక్రాంతి తెచ్చే సంబరాలు ప్రతి ఇంట ఆనందాలు, సంతోషాలు ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
మా ప్రెసిడెంట్ శ్రీరామ్ మాట్లాడుతూ మా దేశాన్ని దాటి ఎంత దూరం వచ్చినప్పటికీ మన సంస్కృతి సంప్రదాయాలను మరచిపోకుండా వాటిని కాపాడుతూ రాబోయే తరం పిల్లలకు తెలియజేయడం మన బాధ్యత అని గుర్తు చేశారు.ఈ అంతేకాకుండా సంక్రాంతి పండుగ గొప్పతనాన్ని వివరించారు.ఈ మంచి కార్యక్రమానికి స్పాన్సర్ గా వచ్చిన శ్రీ బిర్యానీ,టెక్ తీరా, ఎస్‌వీఐ టెక్నాలజీస్, ఆక్సీ డేటా, రెడ్ వేవ్, జాస్ ట్రేట్జ్,క్లబ్ మహీంద్రా ,మినీ మార్ట్, మై టెక్ ,కానోపుస్, లు లు మనీ , ఈగల్ టెక్ ,నిమ్మల, మై 81,ఫామిలీ గార్డెన్,దేశి తడ్కా,బిగ్ సి హైదరాబాద్,మై బిర్యానీ హౌస్,ప్రబలీస్ రెస్టారెంట్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.